అన్వేషించండి

AP, TS Political Foul Language : రాజకీయ విమర్శలంటే అవేనా..? చెవులకు చిల్లులు పడేలా చేస్తున్న ఏపీ, తెలంగాణ నేతలు..!

తెలుగు రాష్ట్రాల నేతలు రాజకీయ విమర్శల్లో గీత దాటిపోతున్నారు. వ్యక్తిగత విమర్శల స్థాయిని దాటి బూతులు తిట్టుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.


రాజకీయం అంటే హుందాతనం. ఎంత మర్యాదగా ఉంటే ప్రజల్లో అంత మంచి పేరు వస్తుంది. తెల్లని దుస్తుల్లో కనిపించడమే కాదు.. అలాగే వ్యవహరిస్తేనే రాజకీయంగా మనుగడ ఉంటుందని అనుకుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎంత మురికిగా మాట్లాడితే అంత గొప్ప రాజకీయ నేత అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మూడు, నాలుగు రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల భాషను చూస్తే ఇదే ఖాయం చేసుకోవాలి. ఎవరికీ ఎవరూ తగ్గడం లేదు. మీరు ఒకటి అంటే.. నేను నాలుగు అనలేనా అని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తిట్లు లంకించుకుంటున్నారు. వీరి మాటలు మీడియాలో చూపించలేరు కూడా అలా చూపించాల్సి వస్తే బీప్ సౌండ్స్ మాత్రమే వస్తాయి. సోషల్ మీడియాలో ఎలాంటి పరిమితులు లేవు కాబట్టి అక్కడ వీరి లాంగ్వేజ్ రీ సౌండ్ చేస్తోంది. 

మైనంపల్లి వర్సెస్ బీజేపీ తిట్ల పురాణం..!

హైదరాబాద్ మల్కాజిగిరిలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా పండుగలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య గొడవ జరిగింది. బీజేపీ కార్పొరేటర్‌కు గాయాలయ్యాయి. ఆ అంశం ఆధారంగా రాజకీయం రాజుకుంది. రాజకీయాల్లో ఇలాంటి గొవడలు సహజమే. కానీ అక్కడ లీడర్లు మాటల్లో అదుపు తప్పిపోయారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు  బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు అని చెప్పుకోవడం కాస్త గౌరవంగా ఉంటుంది.. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు " బూతులు " అని అనుకోవాలి. ఆయన అన్ని మాటలంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఊరుకుంటారా..?  వారూ ప్రారంభించారు. ఆ తిట్ల ప్రవాహం అలా సాగుతూనే ఉంది. ఎప్పటికి తెర పడుతుందో చెప్పడం కష్టం. 

వైసీపీ వర్సెస్ టీడీపీ రోజూ అదే పంచాంగం..!

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి. అదే ఆగస్టు 15వ తేదీన గుంటూరు నడిబొడ్డున దళిత యువతిని ఓ ప్రేమోన్మాది హత్య చేశాడు. ఆమె కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్ కుమార్తెలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్ట్ చేస్తారు .. దళిత యువతుల్ని చంపుతూంటే పట్టించుకోరా అని విమర్శించారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ముందుగా మంత్రి కొడాలి నాని తిట్ల వర్షం కురిపించారు. అయితే ఆయన భాష మామూలుగా అలాగే ఉంటుందని అందరూ సరిపెట్టుకున్నా.. వెంటనే మరికొంత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెరపైకి వచ్చారు. ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ లాంటి వారు లోకేష్‌పై తిట్ల వర్షం కురిపించారు.  నోరు వైసీపీ నేతలకేనా .. మాకు లేదా అని టీడీపీ నేతలూ రంగంలోకి దిగారు. ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. ఆ తిట్లన్నింటిన చెప్పలేము.. వినిపించలేము కానీ.. ఆయా పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో మాత్రం వాటిని చూసి భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. 

కట్టడి చేయాల్సిన ఆయా పార్టీ పెద్దలే ప్రోత్సహిస్తున్నారా..? 

రాజకీయం అనేది ప్రజల కోసం చేసేది. రాజకీయ నేతల మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఉండకూడదు. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. వ్యక్తిగత శత్రువుల్లాగే ప్రవర్తించాల్సి వస్తోంది. వ్యక్తిగతంగా తిట్టుకుంటున్నారు...కుటుంబాల్ని రోడ్డు మీదకు.. సోషల్ మీడియా పోస్టుల్లోకి తీసుకు వస్తున్నారు. ఇంత జరుగుతున్నా వారిని ఆయా పార్టీ అధిష్టానాలు ఏ మాత్రం ఆపడం లేదు. అది పార్టీకి గౌరవం కాదని చెప్పడం లేదు. పైగా ఇంంకా ప్రొత్సహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ అసెంబ్లీలోనే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు. దానికి సీఎం జగన్ ఆయనకు అభినందులు తెలిపారు. అది వైఎస్ఆర్ సీపీ నేతల్లోకి ఎలాంటి సంకేతాలు పంపిందో కానీ సీఎం జగన్ మెప్పు కోసం మరింత దూరం వెళ్తున్నారు. వారు తిడితే పడాలా అని.. టీడీపీ నేతలూ వారికి అదేరీతిలో సమాధానం చెబుతున్నారు. 

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల భాషచూస్తే ఇక రాజకీయంగా విమర్శలు అంటే బూతులు తిట్టుకోవడమే అన్న అభిప్రాయం ప్రారంభమవడం ఖాయంగా కనిపిపిస్తోంది.  ఇక నుంచి పద్దతిగా సంప్రదాయంగా ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే.. అది రాజకీయంలో బూతు అనుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సంస్కరించాల్సిన నాయకులే ఇలా సంస్కరణ అవసరమైన నేతల్లాగా మారితే ప్రజలే కార్యోన్ముఖులు కావాల్సి ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Embed widget