అన్వేషించండి

Ratan Tata Innovation Hub: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గిన్నిస్ రికార్డు - ప్రారంభించిన రోజునే లక్షన్నరకుపైగా రిజిస్ట్రేషన్లు !

Mangalagiri: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో గిన్నిస్ రికార్డు స్థాయి రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్టార్టప్ లకు ఊపిరి పోసేలా అమరావతితో పాటు ఐదు చోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Ratan Tata Innovation Hub Guinness World Record registrations:  ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను మంగళగిరిలోని మయూరి టెక్ సెంటర్లో ప్రారంభించారు.  అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల ఇన్నోవేషన్ కేంద్రాలను హబ్ అండ్ స్పోక్ మోడల్ లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. 

 మయూరి టెక్ పార్కులో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కలిసి  ముఖ్యమంత్రి ప్రారంభించారు. రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నామని... రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించటం ఓ చారిత్రాత్మక సమయం. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంభించారు. రతన్ టాటా ఆలోచనల్ని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్ హబ్ లను ప్రారంభించాం. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయి. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఉండాలని నిర్ణయించాం. యువతకు ఉన్న వినూత్న ఆలోచనల్ని క్రోడీకరించి ప్రోత్సహించేలా ఈ ఇన్నోవేషన్ హబ్ పని చేస్తుంది. యువపారిశ్రామిక వేత్తలు అవకాశాలను వాడుకోండి. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు  పోతాయన్న  అంశాన్ని నేను విశ్వసించను. ఏపీ పారిశ్రామికవేత్తలు గ్లోబల్ కమ్యూనిటికీ సేవలందించేలా ఎదగాలని కోరుకుంటున్నా. అగ్రిటెక్ లో ఇన్నోవేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, ఇలా అనేక రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి." అని సీఎం వివరించారు.చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన రోబో...

ఇంటికో పారిశ్రామిక వేత్త వచ్చేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం 

ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామిక వేత్త రావాలనేదే  తన నినాదమని చంద్రబాబు తెలిపారు.  ఈ లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు పనిచేస్తాయి. సరైన ప్రభుత్వ విధానాలు అవలంభిస్తే ఆదాయం, సంపద వస్తుంది. భవిష్యత్ అంతా ఐటీ రంగానిదేనని నాడు గుర్తించాను. దేశంలో ఎవరూ చేయనంతగా ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశాం. సంపద సృష్టి జరగాలంటే ఆర్థిక వృద్ధి అవసరం. గత 10 ఏళ్లలో 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. అప్పుడు సంపద మరింతగా పెరుగుతుంది. ఈ అవకాశాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలి. దీని కోసం రాష్ట్రాన్ని, అమరావతి సహా వివిధ ప్రాంతాలను సిద్దం చేస్తున్నాం. ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రచించాం. అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశాన్ని దేవుడు నాకిచ్చాడు. క్వాంటం వ్యాలీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇక విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి అంతర్జాతీయ ప్రమాణాలు సాధింటంలో మన పరిశ్రమలు మెరుగైన ఫలితాలు సాధించాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనలు, ఎకో సిస్టం ఉంటేనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు అందించగలం. దీంట్లో భాగంగానే అమరావతి నగరం క్వాంటం కంప్యూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది. క్వాంటం కంప్యూటింగ్ ద్వారా రియల్ టైమ్ డేటాను విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం." అని చంద్రబాబు చెప్పారు. 

సంపద ఫుల్... సంక్షేమం డబుల్

"మరింత సంపద సృష్టించాలి. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది... సంక్షేమం చేయవచ్చు. కమ్యూనిజం, కేపటలిజం ఏమీ ఉండదు. టూరిజమే ఉంటుంది. టూరిజం కూడా అత్యధిక ఉపాధి కల్పించే రంగం. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేయడమే లక్ష్యం. ఒక వైపు సందప సృష్టిస్తూనే.. పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పీ4 కింద పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఓవైపు సంపద సృష్టి.. మరోవైపు పేదల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీని మారుస్తామని భరోసా ఇచ్చారు.  "స్టార్టప్ లకు ఎన్నో అవకాశాలున్నాయి. ఇన్నోవేషన్ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, డిఫెన్సు, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో పరిష్కారాలకు అవకాశాలున్నాయి. ఇన్నోవేషన్ హబ్ ల ద్వారా స్థానిక, ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అంశాలకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్నో ఆలోచనల సమాహారంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మారుతుందని ఆశిస్తు్న్నా. సీఎం చంద్రబాబు తన దార్శనికతతో కొద్ది సమయంలోనే  రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూపం ఇచ్చారు." అని  టాట్ గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. 

రికార్డుల స్థాయిలో రిజిస్ట్రేషన్లు 

ఏపీలో ఇన్నోవేషన్, బిజినెస్ స్టార్టప్ ల కోసం రికార్డు స్థాయిలో 1,67,321 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 24 గంటల్లో ఈ స్థాయి రిజిస్ట్రేషన్లు జరగటంపై ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందచేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో వివిధ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget