అన్వేషించండి

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్

Andhra Pradesh News | ఏపీలో గత ప్రభుత్వంలో అప్పనంగా ప్రభుత్వ ఆస్తులను అదానీకి కట్టబెట్టారని, అధికారంలోకి నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు.

 YS Sharmila Comments on Ports in Andhra Pradesh | అమరావతి: వైఎస్ షర్మిల మరోసారి గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే, కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అన్న జగన్ అప్పనంగా అదానీకి పోర్టులు రాసిచ్చారని ఆరోపిస్తూనే, ప్రతిపక్షంలో చంద్రబాబు చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్  హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై సైతం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా లేదు అని షర్మిల ఆరోపించారు. వాటిపై ఒక్క విచారణకు సైతం దిక్కులేదు. రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు.. కృష్ణపట్నం పోర్టును సైతం గుంజుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారు.
 
గత ప్రభుత్వంలో తప్పిదాలపై చర్యలు ఎవరు తీసుకుంటారు?

ఏపీని పోర్టులకు హబ్‌గా మార్చే పాలసీలు సరే. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..? అని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రతి ఏటా దాదాపు రూ.2వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి రాసి ఇచ్చింది. నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9 వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారని షర్మిల ఆరోపించారు. 

గంగవరం పోర్టులో ప్రతిపక్షంలో అలా, అధికారంలోకి వస్తే మౌనమా

అదే విధంగా 2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను వ్యాపారవేత్త అదానీకి వైసీపీ హయాంలో కట్టబెట్టారు. BOT కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అది. దాన్ని అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవని చెప్పారు. కళ్లు మూసీ తెరిచేలోగా జగనన్న వారికి అన్ని అనుమతులు ఇచ్చేశారు. పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగం అని అప్పట్లో బుకాయించారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇచ్చిన హామీలకు, ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలకు ఎంతమాత్రం పొంతన లేదన్నారు. గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొవడానికి చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సూచిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

Also Read: AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Guntur Latest News : గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
Andhra Pradesh Latest News:
"అక్టోబర్‌ 2 తర్వాత హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు" చంద్రబాబు వార్నింగ్ మెసేజ్ 
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamPawan Kalyan on Tamil Movies | భారతదేశం ఏమన్నా కేకు ముక్క కోసుకోవటానికి.? | ABP DesamPawan Kalyan on his Ideology | పూటకో పార్టీతో ఉంటావనే వాళ్లకు ఇదే నా ఆన్సర్ | ABP DesamPawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Guntur Latest News : గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
Andhra Pradesh Latest News:
"అక్టోబర్‌ 2 తర్వాత హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు" చంద్రబాబు వార్నింగ్ మెసేజ్ 
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Tirupati Crime News:రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Telangana CM Revanth Reddy : కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
Embed widget