Andhra Pradesh HC Update: అలా.. గర్ల్ ఫ్రెండ్ ను విచారించాల్సిన అవసరం లేదు
భర్తతో సన్నిహితంగా ఉంటున్న వేరే మహిళను విచారించాడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు తెలిపింది. భర్త బంధువుల లిస్టులో గర్ల్ ఫ్రెండ్ రాదని స్పష్టం చేసింది.
ఐపీసీ సెక్షన్ 498ఏ((మహిళను వేధింపులకు గురిచేయడం) కింద నమోదు చేసిన కేసులో భర్తతో సన్నిహితంగా ఉంటున్న వేరే మహిళను విచారించడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు స్పష్టంగా తెలిపింది. తన భర్తతో సాన్నిహిత్యం కలిగి ఉన్నారని ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేసింది.
గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్ 498ఏ(మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ అతని గర్ల్‌ఫ్రెండ్‌పై పోలీసులు 498ఏ కింద నమోదు చేసిన కేసులో ఆమె అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ సెక్షన్ కింద భర్త రక్త సంబంధీకులు, వివాహం ద్వారా బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలు ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. భర్త బంధువుల్లో గర్ల్‌ఫ్రెండ్ రాదని, అందువల్ల ఆమెను 498ఏ కింద విచారించడానికి వీల్లేదని తెలిపింది.
తన భర్తతో సాన్నిహిత్యం కలిగి ఉందని.. ఓ మహిళపై మరో మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా దిశ మహిళ ఠాణా పోలీసులు 498ఏ, మరో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ భర్తను మొదటి నిందితునిగా , సన్నిహితంగా ఉంటున్న మహిళను రెండో నిందితురాలిగా పేర్కొన్నారు. దిశ పోలీసులు 498ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్... ఫిర్యాదుదారి భర్తకు బంధువు కాదన్నారు. అందువల్ల ఆమెపై 498ఏ కేసు చెల్లదన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణనలోకి తీసుకుని... పిటిషనర్‌పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేశారు. మరో నిందితుడిపై దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.
498ఏ... ప్రకారం మహిళను భర్త గానీ, భర్త తాలుకూ బంధువులు గానీ హింసించడం నేరం. అలా హింసించిన వారికి కొంతకాలం జైలు శిక్ష ఉంటుంది. అవసరమైతే మూడు సంవత్సరాల వరకు శిక్ష పెంచవచ్చు. జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది.
498ఏపై సుప్రీం కోర్టు గతంలో ఏం చెప్పింది..
- 498-ఏ కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టులు చేయోద్దు
- వరకట్నం కేసుల విచారణకు ప్రతి జిల్లాలోనూ కుటుంబ సంక్షేమ కమీటీలు ఉండాలి
- 498-ఏ కింద వచ్చిన ప్రతి ఫిర్యాదులను పోలీసులు కమిటీలకే పంపాలి
- ఫిర్యాదు అందిన నేల రోజుల లోపు కమిటీలు పోలీసులకు నివేదిక అందజేయాలి
- మహిళలపై భౌతికగాయాలు ఉన్నప్పుడు ఈ మార్గదర్శకాలు వర్తించవు
- ఇలాంటి కేసులను డీసీపీ స్థాయి ఉన్నత పోలీసు అధికారులు మాత్రమే విచారించాలి
- ఐపీసీ 498-ఏ, గృహహింస, కుటుంబ కలహాలపై వచ్చిన ఫిర్యాదులను పోలీసులు లేదా దర్యాప్తు అధికారులు లేదా మేజిస్ట్రేట్.. ముందుగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటుచేసిన ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలనకు అందజేయాలి. ఈ ఫిర్యాదును కమిటీ సభ్యులు పరిశీలించి, రెండు కుటుంబాల సభ్యులతో నేరుగా లేదా ఫోన్‌లో లేదా ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వా రా సంప్రదింపులు జరపాలి.
- ఫిర్యాదుపై నెలలోగా నివేదికను కమిటీ తయారుచేసి పరిశీలన కోసం పంపిన అధికారులకు లేదా మేజిస్ట్రేట్‌కు తిరిగి అందజేయాలి.
- నివేదిక వచ్చేవరకు అరెస్టులు చేయడానికి వీల్లేదు.