Ranatunga In Puttaparty : శ్రీలంకకు అత్యవసర మందులు ఇవ్వండి - సత్యసాయి ట్రస్ట్‌ను కోరిన అర్జున రణతుతంగ !
శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్‌తో సమావేశమయ్యారు. శ్రీలంకకు అత్యవసర మందుల సాయం చేయమని విజ్ఞప్తి చేశారు.
శ్రీలంకలో ( Srilanka ) దుర్భర పరిస్థితులు ఉన్నాయని అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సత్యసాయి ట్రస్ట్‌ను కోరేందుకు శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆ దేశ రాజకీయ నేత అర్జున రణతుంగ ( Arjuna Ranatunga ) పుట్టపర్తికి వచ్చారు. తొలుత సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శ్రీలంకలో నెలకొన్ని పరిస్థితులపై వారు ఇరువురి మధ్య చర్చ జరిగింది.
ఎంపీ సంజీవ్‌ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఖాతా నుంచి 97వేలు మాయం
భగవాన్ సత్యసాయి బాబా నడియాడిన పుట్టపర్తికి ( Puttaparty ) రావడం సంతోషంగా ఉందని అర్జున రణతుంగ తెలిపారు. భగవాన్ సత్యసాయి బాబా దివ్య ఆశీస్సులు శ్రీలంక దేశ ప్రజలకు ఉండాలని, దేశం ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ( Ratnakar ) తో భేటీ లో జరిగిన అంశాలను మీడియాకు వివరించారు. శ్రీలంక ఆర్థిక పరిస్థితులపై రత్నాకర్ తో చర్చించినట్లు తెలిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ( Srilanka Crisis ) కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలకు కనీస మౌలిక వసతుల సమకూర్చేందుకు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని రత్నాకర్ కు విన్నవించినట్లు తెలిపారు.
"అడ్డా"లో ప్లాన్ చేశారు - అడ్డంగా నరికేశారు ! గంజి ప్రసాద్ మర్డర్ ప్లాన్ బయట పెట్టిన పోలీసులు
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మందుల కొరత ( Medicines ) వేధిస్తోందన్నారు. దీంతో అత్యవసర వైద్య సేవలు అందించడంలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనేక దేశాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీలంకలో ప్రజల ప్రస్తుత జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రాజెక్టులు చేపట్టాలని తెలియచేశామన్నారు. అందుకు రత్నాకర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఏపీలో ఉంటున్నారా ? విద్యుత్ ఆదాకు ప్రభుత్వం చెబుతున్న కొత్త చిట్కాలు తెలుసుకున్నారా ?
అర్జున రణతుంగతో పాటు పలువురు శ్రీలంక క్రికెటర్లు సత్యసాయి భక్తులు. అనేక సార్లు పుట్టపర్తికి వచ్చి సత్యసాయి చేసుకున్నారు. సత్యసాయి మరణం తర్వాత పుట్టపర్తికి వచ్చే ప్రముఖఉల సంఖ్య తగ్గింది. ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడే వస్తున్నారు.