Kodali Nani : ఐటీ నుంచి తప్పించుకున్నా ప్రజల నుంచి తప్పించుకోలేరు - చంద్రబాబుపై కొడాలి నాని ఆగ్రహం!
చంద్రబాబును ప్రజలు శిక్షిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఐటీ నోటీసుల విషయంలో చట్టాలను అడ్డుపెట్టుకుని తప్పించుకున్నా ప్రజలు శిక్షిస్తారన్నారు.
Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఐటీ నోటీసుల నేపథ్యంలో వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని.. ఐటీ నోటీసులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొడాలి నాని సైతం చంద్రబాబుపై విమర్శల దాడి పెంచారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరుడని మండిపడ్డారు. చంద్రబాబుకు సింగపూర్‌లో హోటళ్లు ఉన్నాయని.. అవి ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. చట్టాలను అడ్డంపెట్టుకుని టీడీపీ హయాంలో చంద్రబాబు దోచుకున్నారని కొడాలి నాని ఆరోపించారు.
ఎన్నికల్లో డబ్బు పంపిణీ నేర్పిందే చంద్రబాబు అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 1999లోనే ఒక్కో అభ్యర్థికి రూ.కోటి ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలల్లో 5 నుంచి రూ. 30 కోట్ల వరకూ ఇచ్చి టీడీపీ అభ్యర్థుల తరపున ఓట్లు కొనుగోలు చేశారన్నారు. అలా దాదాపు రూ. 10 వేల కోట్ల వరకూ టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చారని కొడాలి నాని చెప్పారు. 2014 ఎన్నికల్లో జగన్ డబ్బులు పంచి ఉంటే అప్పుడే సీఎం అయ్యే వారని వ్యాఖ్యానించారు. జగన్ 2014లో ఓడిపోయారని, ఆ తర్వాత ఎవరినైనా కలిశారా ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే గెలిచి అధికారంలోకి రాలేదా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల నుంచి చంద్రబాబు ఈసారి కూడా తప్పించుకోలేరని కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
1999 లోనే ఒక్కో అభ్యర్ధికి కోటి చొప్పున ఇచ్చాడన్నారు. ఆ తర్వాత ఎన్నికలలో వరసగా 5, 10, 20, 30 కోట్ల రూపాయలు చొప్పున అభ్యర్దులకు ఇచ్చారని పదివేల కోట్లరూపాయలు తన పార్టీ అబ్యర్దులకు చంద్రబాబు ఇచ్చాడనేది వాస్తవమని తెలిపారు. ఈ డబ్బు అంతా చంద్రబాబుకు ఎలా వచ్చిందంటే కమీషన్లు తీసుకోబట్టే కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చిన 118 కోట్లు అనేది చాలా తక్కువ మొత్తం ఇధి రికార్డుగా దొరికిన డబ్బు మాత్రమే...లక్ష కోట్లు వరకు దోచుకున్నాడని ఆరోపించారు. హెరిటేజ్ ద్వారా ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చంద్రబాబు చెప్పాలన్నారు. పాలు,పెరుగు,అమ్మే వాళ్లు చాలా మంది ఇప్పటికీ అలాగే ఉన్నారని.. ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబేనన్నారు.
వచ్చే ఎన్నికలలో వేల కోట్లు ఖర్చు పెట్టి అయినా గెలవాలని చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు క్లీన్ చిట్ అని కేసులు లేవంటున్నారని.. రెండు ఎకరాల వ్యక్తి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ఈ చట్టాలు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎలా చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. జగన్ 2014 లో ఓడిపోయారని ఎవరినైనా కలిశారా...ఒంటరిగా పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖరరెడ్డిజి ఏమైనా పేద కుటుంబమా ఇన్ కం ట్యాక్స్ మేనేజ్ చేసి, బీజేపీ, మోడీ కాపాడినా...రాష్ట్ర ప్రజల నుంచి చంద్రబాబు తప్పించుకోలేడని కొడాలి నాని విమర్శించారు.