అన్వేషించండి

Monkeypox RT-PCR Kit : దేశంలోనే తొలి మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ రెడీ - విశాఖ మెడ్‌టెక్ జోన్ ఘనత - ఆవిష్కరించిన చంద్రబాబు

Chandrababu : దేశంలో తొలి మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. వైజాగ్ మెడ్‌టెక్ జోన్ లో దీన్ని రూపొందించారు.

First indigenous Monkeypox RT-PCR Kit Released by Chandrababu : కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు  ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది మంకీపాక్స్ వైరస్. ఈ వైరస్ వ్యాక్సిన్ కనుగొన్నారు కానీ టెస్టులకు మాత్రం ఇంకా నమ్మకమైన టెస్టింగ్ కిట్ ఏదీ రాలేదు. మన  దేశంలో ఇప్పటి వరకూ అలాంటి టెస్టింగ్ కిట్ లేదు. మొదటి సారిగా విశాఖలోని మెడ్ టెక్ జోన్ లో మంకీపాక్స్ వైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు ఆర్టీపీసీఆర్ కిట్ తయారు చేశారు. ఈ కిట్ కు.. జాతీయ స్థాయిలో అన్ని రకాల వైద్య సంబంధిత వర్గాల నుంచి అనుమతులు వచ్చాయి. ఈ కిట్ ను ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో ఆవిష్కరించారు. 

విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ తయారీ అభినందనీయమని చంద్రబాబు అన్నారు.  మొట్టమొదటి దేశీయ మంక్సీపాక్స్ టెస్ట్ కిట్ విడుదల గర్వకారణమని.. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు.  మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేసిన మెడ్ టెక్ జోన్ నిపుణులు చంద్రబాబుతో ఆవిష్కరింపచేశారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరణ కార్యకమంలో చంద్రబాబు పాల్గొన్నారు.  విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రికి కిట్ పనితీరును వివరించారు. 

ఈ కిట్ ను తక్కువ ధరతో ప్రజలకు  అందుబాటులోకి తెస్తామని మెడ్ టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు.  మెడ్ టెక్  జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్‌  ... ErbaMDx MonkeyPox RT-PCR Kit  పేరిట ఈ కిట్ రూపకల్పన చేసింది.  ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతి కూడా లభించింది.  మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను రూపొందించిన మెడ్ టెక్ జోన్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.  మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందని.. ప్రభుత్వం నుండి మెడ్ టెక్ జోన్ కు అన్ని విధాలా సహాయ,సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. 

మరిన్ని మెడికల్ అద్భుతాలకు మెడ్ టెక్ జోన్ ఆవిష్కరణకు సిద్ధమయిందని ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలిపారు.  వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా త్వరలో సోలార్ తో నడిచే ఎలక్ట్రానికి వీల్ చైర్ ను రూపొందిస్తున్నామని  దాన్ని త్వరలోనే మార్కెట్‌లోకి తేబోతున్నామని తెలిపారు.  తక్కువ ఖర్చుతో మన్నిక గల వైద్య పరికరాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వైజాగ్ మెడ్ టెక్ జోన్ కరోనా సమయంలో ఆర్టీపీసీఆర్ కిట్లను ఉత్పత్తి చేసి.. ఎంతో ఉపయోగపడింది. వైద్య రంగంలో భారీగాపరిశోధనలు చేసి.. తక్కువ ఖర్చుతో వైద్య పరికరాలు రూపొందించడానికి నిరంతరం కృషి చేస్తోంది.     

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget