అన్వేషించండి

AP News: ఏపీ సర్కార్‌కు ఎన్నికల సంఘం షాక్! ఆ పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

YSR Rythu Bharosa Funds: వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం ఈసారి కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. అందుకు నిరాకరించింది.

YSR Rythu Bharosa Jagananna Vidya Deevena funds in AP: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అమలులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల కాగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఇప్పటికే పలు ఈసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా నిధుల విడుదల విషయంలోనూ అంతే వ్యవహరించింది. 

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం ఈసారి కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిధుల విడుదల కుదరదని ఈసీ తేల్చిచెప్పింది. ఈ మే నెలలో విడుదల చేయాల్సిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ (విద్యాదీవెన), ఇన్ పుట్ సబ్సిడీ (రైతు భరోసా) లాంటి పథకాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వీటి విడుదలకు పర్మిషన్ ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇవి గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న పథకాలు అని, కొత్త పథకాలు కావని స్పష్టత ఇచ్చింది. కాబట్టి, ఇవి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి రావని వివరించింది. అయినప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం సదరు సంక్షేమ పథకాల సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు.

వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీకి బ్రేక్
ఏపీలో గత నెల నుంచే ఆసరా పింఛన్లను నేరుగా ఇంటికి వెళ్లి అందించే ప్రక్రియను ఈసీ ఆపేసింది. అంతకుముందు వరకూ ఆసరా పెన్షన్లను ఇంటింటికీ వాలంటీర్లు వెళ్లి అందించేవారు. అందుకు ఈసీ ఒప్పుకోకపోవడం.. అంతకుముందే వాలంటీర్లను దూరం పెట్టాలనే ఆదేశాలు ఉండడంతో.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమ చేశారు. కదల్లేని స్థితిలో ఉన్నవారి ఇంటికి సచివాలయ సిబ్బంది ద్వారా అధికారులు డబ్బులను పంపిణీ చేయించారు. దీనిపైనే అధికార పార్టీ, విపక్షపార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్, ఇన్ పుట్ సబ్సిడీ పథకాల డబ్బులను విడుదల చేయడానికి ఈసీ నిరాకరించింది.

టాప్ హెడ్ లైన్స్

Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget