Cm Jagan: సీఎం జగన్ కు ఎన్నికల సంఘం నోటీసులు - ఎందుకంటే?
Andhrapradesh News: సీఎం జగన్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
Election Commission Notices To Cm Jagan: సీఎం జగన్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. జగన్ తన ప్రసంగాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా సీఎంకు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. సకాలంలో స్పందించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాగా, ఇటీవల సిద్ధం సభల్లో సీఎం జగన్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. మోసం చేయడమే చంద్రబాబుకు అలవాటని.. ఆయన్ను అరుంధతి సినిమాలో పశుపతితో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేయగా.. పరిశీలించిన సీఈవో నోటీసులు జారీ చేశారు.
Also Read: YS Sharmila: జగన్ కుంభకర్ణుడు, ఇప్పుడే నిద్రలేచాడు - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు