VV Laxmi Narayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పార్టీకి 'టార్చ్ లైట్' గుర్తు కేటాయింపు - ఈసీ కీలక నిర్ణయం
Andhra Politics: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పార్టీకి ఈసీ టార్చ్ లైట్ గుర్తు కేటాయించింది. కామన్ సింబల్ కేటాయించడంతో ఆయన ఈసీకి ధన్యవాదాలు తెలియజేశారు.
EC Allotted Torch Light As The Symbol of VV Laxmi Narayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ 'జైభారత్ నేషనల్ పార్టీ'కి ఎన్నికల సంఘం గురువారం గుర్తును కేటాయించింది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్ గా టార్చ్ లైట్ ను కేటాయిస్తూ ఈసీ (Election Commission) నిర్ణయం తీసుకుంది. దీనిపై లక్ష్మీ నారాయణ (VV Laxmi Narayana) స్పందించారు. కామన్ సింబల్ కేటాయించడం పట్ల ఈసీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, కొన్ని నెలల కిందటే ఆయన 'జై భారత్ నేషనల్ పార్టీ'ని స్థాపించారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీ నారాయణ గత ఎన్నికల్లో జనసేనలో చేరారు. 2019లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేశారు. అనంతరం, ఆ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రంలో పర్యటించారు. తర్వాత సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు.
The ECI has allotted “ Battery Torch” common symbol to our “ Jai Bharat National Party”. #jaibharatnationalparty pic.twitter.com/PlkVxtdOif
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) March 14, 2024