అన్వేషించండి

IT raids on MVV Satyanarayana : వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇళ్లల్లో ఈడీ సోదాలు- దోచుకున్న ఎవర్నీ వదిలేది లేదన్న సీఎం రమేష్

Andhra Pradesh : వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో దోచుకున్న ఎవర్నీ వదిలేది లేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు.

IT raids on former YCP MP MVV Satyanarayanas house :  విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములుగా ఉన్న  ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు ,  గద్దె బ్రహ్మాజీ వంటి వారిపై ఈడీ దాడులు నిర్వహించింది. విశాఖలో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హయగ్రీవ యజమాని జగదీశ్వరుడు ఫిర్యాదు మేరకు ఇటీవల ఎంవీవీ, జీవీ, బ్రహ్మాజీపై కేసు నమోదు అయింది.  అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు నుంచి వివరాలు తీసుకుని ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.  

హయగ్రీవ  భూముల వ్యవహారంపై నమోదు చేసిన కేసులో దాడులు        

విశాఖలోని ఎండాడ కొండపై సర్వే నెంబరు 92/3లో గల 12 ఎకరాలను 2008లో హయగ్రీవ సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఎకరా రూ.45 లక్షలకు కొన్నారు. వయోవృద్ధులకు హౌసింగ్‌ ప్రాజెక్టు కోసమని తక్కువకు కొనుగోలు చేసి మూడేళ్లలో ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణాలు చేపట్టలేదు.   వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది చేతులుమారింది.  అక్కడ భారీ విల్లా ప్రాజెక్టులు కడుతున్నారు. కోర్టు కేసులు ఉన్నాయి.  తనను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుని  ఆ భూమిని కబ్జా చేశారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.

2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక

 ఈ కేసులో ముందస్తు  బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎంవీవీ       

ఈ కేసు విషయంలో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ఎంవీవీ సత్యనారాయణ కొన్నాళ్లు ఆజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. సినీ నిర్మాతగా పలు సినిమాలు తీసిన ఎంవీవీ విశాఖపట్నంలో ప్రముఖ బిల్డర్ గా ఉన్నారు. అయితే ఆయనపై అనేక వివాదాలు ఉన్నాయి. భూ వివాదాల్లో ఆయన పేరు వినిపిస్తోంది. గతంలో ఆయన కుటుంబాన్ని కొంత మంది రౌడీషీటర్లు ఇంట్లోనే బంధించి డబ్బులు డిమాండ్ చేశారు. తర్వాత కిడ్నాప్ చేశారని.. మధ్యలో కాపాడామని పోలీసులు ప్రకటించారు. దానిపై ఇంకా విచారణ జరుగుతోంది. 

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?

ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని.. ఇంకా కొనసాగుతాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హెచ్చరించారు.  వైసీపీ నేతలు దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి ప్రజల కోసం ఉపయోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఓ వీడియో విడుదల చేశారు.  వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తానే ఫిర్యాదు చేశానని  త్వరలో మాజీ సీఎం జగన్‎తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయని ప్రకటించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Mahindra Thar: దుమ్మురేపుతున్న థార్ సేల్స్ - నాలుగేళ్లలోనే రెండు లక్షలు!
దుమ్మురేపుతున్న థార్ సేల్స్ - నాలుగేళ్లలోనే రెండు లక్షలు!
Matka OTT Rights Price: ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
Vijay Deverakonda: లవ్ లైఫ్ గురించి పబ్లిగ్గా చెప్పిన విజయ్ దేవరకొండ... ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనట
లవ్ లైఫ్ గురించి పబ్లిగ్గా చెప్పిన విజయ్ దేవరకొండ... ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనట
Embed widget