By: ABP Desam | Updated at : 22 Jan 2022 07:09 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్న వృద్ధురాలు
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఓ గ్రామంలో ఓటీఎస్ డబ్బులు కట్టాలని ఒత్తిడి తెచ్చిన సిబ్బందిపై వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజంతా కష్టపడి కూలీ పనులు చేసుకునే వాళ్లకు డబ్బు విలువ తెలుస్తుంది. ఒకేసారి రూ.10 వేలు కట్టమంటే ఎలా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటీఎస్ నగదు చెల్లించాలని ఒత్తిడి తెస్తే పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. అడుక్కునేవాళ్ల వద్దా అడుక్కుంటున్నారు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల కిందట కట్టిన ఇంటికి ఇప్పుడు రూ.10 వేలు కట్టమంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల ఓటీఎస్ చెల్లించని వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయమని శ్రీకాకుళం జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి ప్రకటన జారీచేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఓటీఎస్ పై సీఎంకు ముద్రగడ లేఖ
సీఎం జగన్ మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ఇప్పటికే పలు సమస్యల పరిష్కారంపై లేఖలు రాసిన ముద్రగడ పద్మనాభం తాజాగా ఓటీఎస్ పై బహిరంగ లేఖ రాశారు. ఓటీఎస్ పథకంపై వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించారు. ఓటీఎస్ డబ్బులు చెల్లించాలని పేద ప్రజలపై ఒత్తిడి చేయడం సరికాదని ముద్రగడ లేఖలో కోరారు. టీడీపీ హాయంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని సీఎంను కోరారు.
Also Read: చేయని నేరం ఒప్పుకోవాలని దళిత మహిళకు చిత్రహింసలు - చిత్తూరులో మరో "విశారణై" , జై భీమ్ తరహా ఘటన
మీ హక్తు లేదు
ఎప్పుడో పేదవారికిచ్చిన రుణాలను ఇప్పుడు ఓటీఎస్ పేరుతో వసూలు చేయడం సరికాదని ముద్రగడ అన్నారు. ఇలాంటివి ఇప్పటి వరకూ ఎప్పుడూ జరగలేదన్నారు. పేదవారి ఇళ్లకు ఇచ్చిన రుణాలను తప్పనిసరిగా కట్టాలని ఎవరూ చెప్పలేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు ఇప్పటి వరకూ బిల్లులు చెల్లించలేదన్నారు. ఆ బిల్లులు చెల్లించని వైసీపీ సర్కార్ గత ప్రభుత్వాలు పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. ఓటీఎస్ విధానంపై సర్వత్రా విమర్శలు రావడంతో నిన్న జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై చర్చించారు. ఓటీఎస్ నగదును రెండు విడతలుగా చెల్లించేందుకు వెలుసుబాటు కల్పించింది.
Also Read: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?