అన్వేషించండి

RGV Focus On Babu : జగన్ బయోపిక్కే అయినా చంద్రబాబే టార్గెట్ - వర్మ "వ్యూహం" దారి తప్పిందా ?

జగన్ బయోపిక్ వ్యూహంలోనూ చంద్రబాబునే ఆర్జీవీ టార్గెట్ చేశారా ?


RGV Focus On Babu  :  జగన్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ తొలి పార్ట్ వ్యూహం టీజర్ ను రిలీజ్ చేశారు. అందులో నేరు చంద్రబాబు పేరు పెట్టి.. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సన్నివేశాలు పెట్టారని క్లారిటీ వచ్చేసింది. గతంలో ఆర్జీవీ ప్రకటించిన దాని ప్రకారం వ్యూహం సినిమా జగన్ ఇమేజ్ ను పెంచడానికే అనుకున్నారు కానీ.. తర్వాత ప్లాన్ మార్చుకుని చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగా తాజా ట్రైలర్ లో ఉందన్న భావన వ్యక్తమవుతోంది. 

ట్రైలర్ లో కొత్తదనం లేదనే విమర్శలు                   

 తాను తీయబోయేది  బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని గతంలో ఆర్జీవీ ప్రకటించారు. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని ప్రకటించారు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి   “వ్యూహం” కధ వచ్చిందన్నారు.  రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన  ఆగ్రహానికి  ప్రతికాష్టే  “వ్యూహం” చిత్రం అని ఆర్జీవీ  ప్రకటించారు. ఆ ప్రకారం టీజర్ చూస్తే..   హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణించ‌డంతో ఈ టీజ‌ర్ మొద‌లైంది. ఆ త‌ర‌వాత‌.. ప్ర‌తిప‌క్షాలు ప‌న్నే వ్యూహాలు, జ‌గ‌న్‌పై సీబీఐ ఎంక్వైరీ, అరెస్ట్‌… ఇలా టీజ‌ర్ సాగుతూ వెళ్లింది. ఇందులో వ‌ర్మ కొత్త‌గా చెప్పిన విష‌యాలేం లేవు. సంఘ‌ట‌ల్ని గ్లోరిఫై చేయ‌డం తప్ప‌. వ‌ర్మ పాత ప‌ద్ధ‌తిలోనే జూనియ‌ర్ ఆర్టిస్టుల్లాంటి ఫేసుల్ని తెర‌పైకి తీసుకొచ్చి, సినిమాని చుట్టేసే ప్ర‌య‌త్నం చేశాడ‌న్న అభిప్రాయం  సినిమా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబును టార్గెట్ చేస్తూ గతంలోనూ సినిమాల                        

రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. గతంలో ‘వంగవీటి’ సినిమాను తెరకెక్కించారు.  తర్వాత 2019 ఎన్నికలకు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీశారు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత మళ్లీ కొన్నాళ్ల తర్వాత ‘కొండా’ అనే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఓ సినిమా చేశారు. ఆ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. ప్రమోషన్స్ బాగానే చేసినా సినిమా అసలు ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ వై ఎస్ జగన్ లైఫ్ స్టోరీ బ్యాక్డ్రాప్ లో ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కిస్తామని ప్రకటించాడు ఆర్జీవి. మరి ఈ సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ఈ మూవీ లు కూడా గత సినిమాల లాగా ఏమాత్రం బెడిసికొట్టినా అసలకే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ అభిమానులు. 

రెండో భాగంలో పవన్ ను టార్గెట్ చేస్తారా ?                         

రెండు సినిమాలు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఇతరులతో తీయిస్తారని..  జగన్ బయోపిక్‌ను మాత్రం ఆయన స్వయంగా దర్శకత్వం చేస్తారని.. జగన్ కు ఎలివేషన్లు ఇచ్చేలా ఈ సినిమ ఉంటుందన్న అభిప్రాయం వినిపించింది.   బయోపిక్ కాదు రియల్ పిక్ అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పారు కానీ.. అందులో చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వడం.. ఆయనను  విలన్ గా చూపిస్తారని స్పష్టమవుతోంది.  ఈ సినిమా వచ్చే ఎన్నికల ముందు  రిలీజ్ చేసే అవకాశం ఉంది. స్వయంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత , సీఎం జగన్ ఆసక్తితో నిర్మిస్తున్నారు కాబట్టి బడ్జెట్ సమస్య రాదని.. ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
Embed widget