అన్వేషించండి

Vijayawada News: రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Andhra News: విజయవాడ ఇంద్రకీలాద్రికి దసరా సందర్భంగా భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Devotees Rush In Vijayawada Temple: దసరా సందర్భంగా విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri) భక్తులతో కిటకిటలాడుతోంది. విజయదశమి సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీఐపీ, వీవీఐపీ, సాధారణ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పోలీసులు ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. రద్దీని బట్టి దర్శనానికి అనుమతించారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారులు సైతం వేలాదిగా తరలివచ్చారు. చిన్నపిల్లలు, వృద్ధులు సైతం అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. దుర్గమ్మ నామ స్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.

భక్తుల ప్రత్యామ్నాయ మార్గాలు

అటు, భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోగా.. అధికారులు, పోలీసుల ఆంక్షలతో కొన్నిచోట్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైకి వచ్చేందుకు ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో సాహసంతో కొండపైకి చేరుకుంటున్నారు. కొందరు భక్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఎంతో ఆశతో వచ్చామని.. ఇలా ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు.

తెప్పోత్సవానికి బ్రేక్

కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు అమ్మవారు హంస వాహనంపై కృష్ణా నదిలో విహరిస్తారు. అయితే, ఆనవాయితీగా జరిగే ఈ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్రేక్ పడింది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పై నుంచి వస్తుండడంతో తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నదీ విహారానికి అనుమతి లేనందున్న ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకూ తీసుకెళ్లి హంస వాహనంపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఒకవేళ వర్షం వచ్చి ఆటంకాలు ఎదురైతే మహా మండపంలోని ఆరో అంతస్తులో పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

మరోవైపు, తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. స్వామి వారి వాహన సేవలను దాదాపు 15 లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శనివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. 'భక్తులకు సేవ చేయడమంటే భగవంతునికి సేవ చేయడమే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశాం. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి చర్యలు చేపట్టాం. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించాం. 8 రోజుల్లో 6 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించాం. 2.6 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి ఆలయంలో 3.2 లక్షల మందికి నైవేద్యాన్ని ప్రసాదంగా అందించాం. 30 లక్షల లడ్డూలను విక్రయించాం.' అని ఈవో పేర్కొన్నారు.

వైభవంగా చక్రస్నానం

తిరుమలలో శనివారం ఉదయం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు అర్చకులు పుష్కరిణిలో క్రతువు నిర్వహించగా.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 

Also Read: Konaseema News: కబ్జా కోరల్లో ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్‌- రోడ్లున పడ్డ ప్రయాణికులు- చోద్యం చూస్తున్న అధికారులు!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Indrakeeladari Arrangements: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ ఉత్సవ్ కు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget