News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Registrations : ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే కారణం

ఏపీలో మాన్యువల్ పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వర్ల సమస్య వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

FOLLOW US: 
Share:

AP Registrations :  ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో రోజూ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరో రెండ్రోజుల్లో భూముల విలువ పెరుగుతూ వుండటంతో .. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. చలానాల ధర పెరగడంతో తమపై అధిక భారం పడుతుందని భావించి సామాన్యులు తమ భూముల క్రయ విక్రయాలు త్వరగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సర్వర్లు మొరాయించడంతో  సోమవారం ఉదయం నుంచి భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. 2010కి ముందు రాష్ట్రంలో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిగేవి.                     

ఏపీలో భూముల ధరలు పెంచేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. జులై ఫస్ట్‌ నుంచి చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ వ్యాల్యూ పెరగనుంది. దానికి సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ధరలు నిర్థారిస్తూ జాబితా సిద్ధం చేశారు. గతేడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఒకసారి మార్కెట్ ధరలు పెంచింది ఏపీ ప్రభుత్వం. జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు హైక్‌ చేసింది. తాజాగా మరోసారి భూముల ధరలు పెంపునకు రెడీ అయింది. అయితే.. గతంలో ఎక్కడెక్కడ ధరలు పెంచలేదో ఆయా ప్రాంతాల్లో మాత్రమే ల్యాండ్‌ రేట్లు పెరగనున్నాయి. అందులోనూ.. డిమాండ్ ఎక్కువగా ఉన్న చోటే ధరలు పెంచబోతోంది ఏపీ సర్కార్.

భూముల రేట్ల పెంపు ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో వేర్వేరుగా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో అధికారుల నుంచి తీసుకున్న సమాచారం మేరకు జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలు జాబితా సిద్ధం చేశారు. కనీసం 30నుంచి గరిష్టంగా 70 శాతం వరకూ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. గతేడాది జిల్లాల విభజన, భూముల ధరలు పెరుగుదలతో ఏపీ ప్రభుత్వానికి ఆదాయం దండిగా వచ్చింది. సుమారు 8 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నెలకు సగటున 700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ క్రమంలోనే.. ఆదాయాన్ని మరింత పెంచుకునేలా ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ నడుస్తోంది.

 ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇటీవల తరచుగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. తాజాగా.. మంగళవారం కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల్లో భూముల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ప్రజలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు క్యూ కట్టారు. అయితే.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని సర్వర్లు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

Alos Read: ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్ట్ - ఎన్డీఏలోకి టీడీపీ కాదు వైఎస్ఆర్‌సీపీ!?

Alos Read: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న

Published at : 30 May 2023 07:42 PM (IST) Tags: AP News AP REGISTRATIONS Servers Problem

ఇవి కూడా చూడండి

Ap Assembly Session: నాలుగో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్

Ap Assembly Session: నాలుగో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Andhra Pradesh: న్యాయమూర్తులపై దూషణలు: హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

Andhra Pradesh: న్యాయమూర్తులపై దూషణలు: హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Vizag Murder: భార్యపై అనుమానం, స్నేహితుడి హత్య! మూడో అంతస్తు నుంచి తోసేసిన ఫ్రెండ్

Vizag Murder: భార్యపై అనుమానం, స్నేహితుడి హత్య! మూడో అంతస్తు నుంచి తోసేసిన ఫ్రెండ్

టాప్ స్టోరీస్

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు