News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న

APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి ఇప్పటి వరకూ అతీ గతీ లేదని.. డిమాండ్లను పరిష్కరించమని కోరడం కూడా తప్పేనా అంటూ ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. 

FOLLOW US: 
Share:

APJAC Protest: విజయవాడలోని ధర్మా చౌక్ వద్ద ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దు హామీకి ఇప్పటి వరకూ అతీ గతీ లేదని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సూచించిన 14 శాతం పెంపును కూడా అమలు చేయడం లేదని గుర్తు చేశారు. ఉద్యమ కార్యాచరణ వల్ల ఒక్క డీఏ ఇస్తామని ప్రకటించారని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు తెలిపారు. రాబోయే రాజ్యమంతా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులదే అని అన్నారు. అలాగే ఉద్యమం చేయడం వల్లే మళ్లీ అవినీతి నిరోధక శాఖ దాడులు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. ఇలా దాడులు చేస్తూ... ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. చట్టబద్ధంగా రావాల్సి వాటిని మాత్రమే తాము అడుగుతున్నామని చెప్పారు. ఇది తప్పా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

84 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని.. ఉద్యమం ఆగాలంటే డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని వివరించారు. 50 డిమాండ్ల పరిష్కారం మినహా ప్రత్యామ్నాయం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే ఉద్యోమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అదే కనుక జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ వాదనే వినిపిస్తున్నారని... బొప్పరాజు గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు, డీఏలు అవసరం లేదా అని అడిగారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఉండాలా వద్దా అని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి చెప్పినవన్నీ ప్రభుత్వం చెప్పినట్లుగానే తాను భావిస్తున్నారని.. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమేనని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. 

రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందా...?

రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందన్న ప్రభుత్వ వాదనపై ఇటీవలే ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి  చెప్పడం దారుణం అని   విమర్శించారు. ఇటీవలే కాకినాడలో ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. వాలంటీర్ల జీతాలతో పాటు ఏపీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ.60 వేల కోట్లకు మించి ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగులందరూ నిర్లక్ష్యం వహించకుండా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో పాలుపంచుకోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపిచ్చారు. ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే జీతాలు సరైన సమయానికి పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రతీ సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. ఇతర ఉద్యోగ సంఘాలు కలిసి రాకపోయినా బొప్పరాజు మాత్రం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు.  ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని స్పష్టం 

Published at : 30 May 2023 05:29 PM (IST) Tags: Bopparaju Venkateshwarlu APJAC News APJAC Chairmen Amaravati Employees Union Protest Vijayawada Dharna Chowk

ఇవి కూడా చూడండి

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Vizag Murder: భార్యపై అనుమానం, స్నేహితుడి హత్య! మూడో అంతస్తు నుంచి తోసేసిన ఫ్రెండ్

Vizag Murder: భార్యపై అనుమానం, స్నేహితుడి హత్య! మూడో అంతస్తు నుంచి తోసేసిన ఫ్రెండ్

Etapaka Murder case: సుపారీ ఇచ్చి కన్నకొడుకుని చంపించిన తల్లిదండ్రులు - అసలు విషయం తెలిసి అంతా షాక్!

Etapaka Murder case: సుపారీ ఇచ్చి కన్నకొడుకుని చంపించిన తల్లిదండ్రులు - అసలు విషయం తెలిసి అంతా షాక్!

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు SLPపై నేడే సుప్రీం కోర్టులో విచారణ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు SLPపై నేడే సుప్రీం కోర్టులో విచారణ

Top Headlines Today: నేడు సుప్రీంలో బాబు పిటిషన్ విచారణ; కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక? - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: నేడు సుప్రీంలో బాబు పిటిషన్ విచారణ; కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక? - నేటి టాప్ న్యూస్

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Kajal Aggarwal Photos : చుడిదార్ వేసిన చందమామ - కాజల్ కొత్త ఫొటోస్ చూశారా?

Kajal Aggarwal Photos : చుడిదార్ వేసిన చందమామ - కాజల్ కొత్త ఫొటోస్ చూశారా?

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?