అన్వేషించండి

Resigned YSRCP MLCs: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు - జయమంగళ రివర్స్ అవుతారా?

YCP MLCs: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు విచారణకు మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Council Chairman issues notices  to resigned YCP MLCs: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన లుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. మండలి చైర్మన్ నోటీసులు అందుకున్న వారిలో మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత,  జయమంగళ వెంకటరమణ  ఉన్నారు. వీరు గతంలోనే వైసీపీకి రాజీనామా చేసి, ప్రస్తుతం టీడీపీ, జనసేన వంటి కూటమి పార్టీల్లో కొనసాగుతున్నారు. చైర్మన్ వీరిని వ్యక్తిగతంగా పిలిచి, వారు తమ రాజీనామాలను స్వచ్ఛందంగానే సమర్పించారా? లేక ఎవరి ప్రోద్భలంతోనైనా, ప్రలోభాలకు లోనై చేశారా? అనే అంశాలపై ఆరా తీయనున్నారు.                     
 
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలను ఆమోదించడంలో జాప్యం జరుగుతోందని, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ గతంలో జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు, రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్‌కు దిశానిర్దేశం చేసింది.   చైర్మన్ మోషేన్ రాజు ఇప్పుడు చర్యలు వేగవంతం చేస్తూ, రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలకు ఫిబ్రవరి 25, 26 తేదీల్లో  వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.                    
  
వైసీపీకి శాసనసభలో బలం తక్కువగా ఉన్నప్పటికీ, శాసన మండలిలో ఇప్పటికీ ఆధిక్యం ఉంది. రాజీనామా చేసిన ఎమ్మెల్సీల పదవీకాలం ఇంకా మిగిలి ఉన్నందున, వారి రాజీనామాలను ఆమోదిస్తే ఆ స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ సీట్లు కూడా కూటమి ఖాతాలోకి వెళ్తే మండలిలో వైసీపీ తన మెజార్టీని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, ఈ రాజీనామాలను ఆమోదించకుండా అనర్హత వేటు వేసే దిశగా చైర్మన్ ఆలోచిస్తున్నారా  అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.                    
 
ఇప్పటికే పలుమార్లు చైర్మన్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరిన ఎమ్మెల్సీలు, తాము స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు.  ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామా చేసే హక్కు మాకు ఉంది, దీనిపై విచారణ పేరుతో జాప్యం చేయడం సరికాదు " అని వారు వాదిస్తున్నారు. జయమంగళ వెంకటరమణ వంటి నేతలు కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ త్వరగా నిర్ణయం ప్రకటించాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇటీవల జయమంగళ వెంకటరమణ.. తనకు జగన్ దేవుడని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆయన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గుతారన్న ప్రచారం జరుగుతోంది.  జయమంగలను ఫిబ్రవరి 25న విచారిస్తారు. మిగిలిన వారిని ఇరవై ఆరో తేదీన ప్రశ్నించారు.  ఈ విచారణ తర్వాత చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.                        

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
Embed widget