By: ABP Desam | Updated at : 29 Oct 2021 06:20 PM (IST)
ఏపీలో కరోనా కేసులు (File Photo)
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే 100 కేసులు అధికంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 39 వేల పైగా శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 481 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,62,821కు చేరుకుంది. నిన్న కరోనాతో పోరాడుతూ ఒక్కరు చనిపోగా, మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 14,367కు చేరుకుంది.
ఏపీలో ఇప్పటివరకూ 2,94,43,885 (2 కోట్ల 94 లక్షల 43 వేల 885) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 39,604 శాంపిల్స్ చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. నిన్న నమోదైన కేసుల కంటే నేడు అధికంగా కేసులు వచ్చాయి. అయితే కొవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరు చనిపోయారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది.
Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్?.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?
#COVIDUpdates: 29/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,62,821 పాజిటివ్ కేసు లకు గాను
*20,43,617 మంది డిశ్చార్జ్ కాగా
*14,367 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,837#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/n5BVSwqVuF— ArogyaAndhra (@ArogyaAndhra) October 29, 2021
పాజిటివ్ కేసులే ఎక్కువ
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జ్ కేసులు తక్కవగా ఉన్నాయి. తాజాగా 481 మందికి కరోనా సోకగా, కేవలం 385 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ఏపీలో నిన్న అత్యధికంగా తూర్పు గోదావరిలో 157 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరులో 76, కృష్ణాలో 52, గుంటూరులో 39 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అనంతపురం జిల్లాలో అతి తక్కువగా 6 కరోనా కేసులు రాగా, ప్రకాశం 7, కర్నూలు 8, కడప జిల్లాలో 11 మంది కరోనా బారిన పడ్డారు.
Also Read: ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీరెందుకు? రాకుండా చిట్కాలు ఇవిగో
ఏపీలో ఇదివరకే 5 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ పూర్తయింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 500 కంటే దిగువన నమోదవుతున్నాయి.
Gold-Silver Prices Today: పెరిగింది కొండంత, తగ్గేది గోరంత - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ - ఎందుకంటే ?
Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు
ఉద్యమకారులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కారు
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
/body>