Coronavirus Cases Today: ఏపీలో తగ్గుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 765 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా వ్యాప్తి క్రమేపీ తగ్గుతోంది. నిన్నటితో పోల్చితే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా దిగొచ్చాయి. నిన్న ఒక్కరోజులో మరో 9 మంది కరోనాతో చనిపోయారు.
Coronavirus Cases In AP: ఏపీలో గడిచిన 24 గంటల్లో 765 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,49,868కు చేరుకుంది. నిన్న ఒక్కరోజులో మరో 9 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,204కు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంతో కరోనా కేసులు దిగొస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో నేటి ఉదయం వరకు 2 కోట్ల 84 లక్షల 45 వేల 952 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో గడిచిన 24 గంటల్లో 45,481 శాంపిల్స్‌కు కరోనా టెస్టులు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈవారం ప్రారంభానికి ముందు ప్రతిరోజూ గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులు వచ్చేవి. గత మూడు రోజులుగా 1000 దిగువన పాజిటివ్ కేసులు రావడం ఊరట కలిగిస్తోంది.
Also Read: ఇవి తింటే గుండె సేఫ్... పక్షవాతం వచ్చే అవకాశం తగ్గిపోతుంది
#COVIDUpdates: 03/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 3, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,49,868 పాజిటివ్ కేసు లకు గాను
*20,25,307 మంది డిశ్చార్జ్ కాగా
*14,204 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,357#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Zl2XQBWg90
రాష్ట్రంలో నేటి ఉదయం వరకు నమోదైన మొత్తం 20,49,863 పాజిటివ్ కేసులకు గాను.. 20,25,307 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,357కు దిగొచ్చిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శనివారం తాజా బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గానే ఉంది. నిన్న ఒక్కరోజులో 973 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు.
Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?
నిన్న ఒక్కరోజులో గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూల్, నెల్లూరు, విశాఖపట్నం లో ఒక్కొక్కరు కరోనాతో చనిపోయారు. అత్యధికంగా చిత్తూరులో 161, తూర్పు గోదావరిలో 94, గుంటూరులో 91 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా అనంతపురంలో ఒక్కరు, కర్నూలు జిల్లాల్లో 3, విజయనగరం జిల్లాలో 9 మందికి కరోనా సోకింది.