TTD: టీటీడీలో క్రైస్తవుల్ని తొలగించవద్దని చింతామోహన్ ధర్నా - అది సెక్యూలరిజం కాదని బీజేపీ తీవ్ర ఆగ్రహం
TTD: క్రైస్తవ ఉద్యోగుల్ని టీటీడీ నుంచి తొలగించకూడదని కాంగ్రెస్ నేత చింతామోహన్ ధర్నా చేయడం వివాదాస్పదం అవుతోంది. హిందూ మతంపై దాడి చేయడం సెక్యులరిజం కాదని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

Vishnu Vardhan Reddy: తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రైస్తవ ఉద్యోగుల్ని ఇతర శాఖలకు బదిలీ చేయడం లేదా వీఆర్ఎస్ ఇవ్వడానికి టీటీడీ నిర్ణయించింది. తొలి విడతగా పద్దెనిమిది మందిని తొలగించారు. అయితే ఇలా తొలగించడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీ నేత చింతా మోహన్ ధర్నా చేశారు. ఈ అంశంపై ఏపీ బీజేపీ తీవ్రంగా స్పందించింది. తిరుమలలో అనుమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఆందోళన చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.
షర్మిల నేతృత్వంలో నడుస్తున్న ఏపీ కాంగ్రెస్ నుంచి ఇంత కంటే గొప్ప స్పందనను ఊహించలేము కానీ, ఇలా బహిరంగంగా రోడ్డున పడి ధర్నాలు చేయడమేమిటని ప్రస్నించారు. సెక్యులర్ దేశం అంటే ఎవరి మతాన్ని వాళ్లు గౌరవించుకోవడం. అంతే కానీ హిందూ ధర్మం , విశ్వాసాన్ని పాటించని , పవిత్రమైన ప్రసాదం సైతం తాకని క్రైస్తవులకు ఆలయాల్లో ఉద్యోగాలిచ్చి పోషించడం కాదన్నారు. క్రైస్వత, ముస్లిం మత సంస్థల్లో ఇతర మతస్తులకు ఉద్యోగం ఇవ్వడం ఎక్కడైనా ఉందా అని ప్రస్నించారు. వారికి వర్తించని సెక్యూలరిజం ఒక్క హిందూ ఆలయాలకే వర్తింప చేయాలని కాంగ్రెస్ నేతలు ఎందుకు అంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్నించారు.
మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పని కూడా దైవమే. వారికి ఆయా మతాల మీద గౌరవం ఉన్నప్పుడు హిందూ మత సంస్థల్లో పని చేయడం వారి వారి తమ విశ్వాసాలకు భిన్నం. హిందూ దేవుళ్లను ఆరాధించనప్పుడు ఆయా దేవుడి సన్నిధిలో పని చేయడం, ఆ దేవుడికి సేవ చేయడాన్ని ఎలా స్వాగతిస్తారు ? ఆ పేరుతో తమ మత ప్రచారాన్ని కొండపై చేస్తూ తిరుమలను ఎప్పటికప్పుడు అపవిత్రం చేయడానికి ప్రయత్నించే వారికి చోటు ఇవ్వడమే సెక్యూలరిజమా ? అనిప్రశ్నించారు.
ప్రచురణ/ ప్రసారం కొరకు.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) February 15, 2025
తిరుమలలో అనుమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఆందోళన చేయడం సిగ్గుచేటు!
పిచ్చి కుదిరింది , రోకలి తలకు చట్టమన్నాడట.. వెనకటికి ఒకడు. తిరుమలలో టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగస్తుల్ని బదిలీ చేయడంపై కాంగ్రెస్ నేతల తీరు చూస్తూంటే అంత కంటే పిచ్చి… pic.twitter.com/AP95QXHmF7
మీ నాయకుల మెప్పు కోరకు హిందూ మతంపై దాడి చేయాలనుకోవడంమే ప్రమాదకరం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సెక్యూలరిజం అంటే ఏంటో అధ్యయనం చేయాలి. హిందూత్వంపై.. హిందూ సంస్థలపై దాడి చేయడం.. ఇతర మతస్తులను.. హిందూ దేవాలాయాల్లో పాగావేసేలా చేయడం సెక్యూలరిజం కాదని గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పుడు తిరుమల విషయంలో క్రైస్తవులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగానే క్రిస్టియన్, ముస్లిం సంస్థల్లోనూ హిందువులకు ఉద్యోగాలివ్వాలని రోడ్డెక్కే ధైర్యం ఉందా అని విష్ణువర్దన్ రెడ్డి సవాల్ చేశారు. పవిత్రమైన తిరుమల స్వామివారి కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఇంకోసారి ఇలా వ్యవహరిస్తే హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదని హెచ్చరించారు.





















