AP Congress Candidates: ఏపీ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన అధిష్టానం
Andhra Pradesh Congress candidates List: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకుగానూ కాంగ్రెస్ అధిష్టానం మూడో జాబితా విడుదల చేసింది. తాజాగా 9 మంది లోక్ సభ అభ్యర్థుల వివరాలు వెల్లడించారు.
Congress has released Andhra Pradesh candidates List: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇదివరకే రెండు జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్ ఆదివారం (ఏప్రిల్ 21న) మూడో జాబితా విడుదల చేసింది. తాజా జాబితాలో 9 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ప్రకటించింది. ఓవరాల్ గా చూస్తే ఏపీ ఎన్నికల్లో భాగంగా 126 అసెంబ్లీ స్థానాలకు, 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లు అయింది. మరోవైపు వైఎస్ షర్మిల తన నామినేషన్ దాఖలు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు రూ.82 కోట్ల అప్పు, వదిన భారతి నుంచి సైతం తాను అప్పు తీసుకున్నానని అఫిడవిట్లో షర్మిల తెలపడం దుమారం రేపుతోంది.
తొమ్మిది మంది అభ్యర్థులుగా ఛాన్స్
శ్రీకాకుళం నుంచి పి పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం (ఎస్సీ) నుంచి జంగా గౌతం, మచిలీపట్నం నుంచి గొల్లు కృష్ణ, విజయవాడ నుంచి వళ్లూరు భార్గవ్, ఒంగోలు నుంచి సుధాకర రెడ్డి, నంద్యాల నుంచి జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్, అనంతపురం నుంచి మల్లికార్జున్ వజ్జల, హిందూపురం నుంచి బీఏ సమద్ షాహీన్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. వీరితో పాటు ఝార్ఖండ్ లోని గొడ్డా నుంచి ప్రదీప్ యాదవ్, రాంచీ నుంచి యశస్విని సాహేలను అభ్యర్థులుగా ప్రకటించారు.
ఏపీలో ఎన్నికలకుగానూ కాంగ్రెస్ తొలి జాబితాలో 5 పార్లమెంటు స్థానాలతో పాటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఏపీ నుంచి రెండో జాబితాలో 6 ఎంపీ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. తాజాగా 9 మంది లోక్ సభ అభ్యర్థుల్ని పార్టీ ఖరారు చేసింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి, కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు, రాజమండ్రి నుంచి పిసిసి మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ బరిలోకి దిగుతున్నారు.
Also Read: ఏపీ కాంగ్రెస్ జాబితా విడుదల, కడప నుంచి బరిలోకి షర్మిల