AP Congress Candidates : కడప లోక్‌సభకు షర్మిల పోటీ - 5 పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ !
Andhra News : ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. కడప లోక్‌సభకు షర్మిల పోటీ చేస్తున్నారు.
Congress has released Andhra candidates List : ఏపీలో 5 పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. లోక్ సభ బరిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఉండనున్నారు. కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీలో షర్మిల పోటీ చేస్తారు. కాకినాడ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు, రాజమండ్రి స్థానం నుంచి పిసిసి మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, బాపట్ల స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. అలాగే 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్ నందికొట్కూరు నుంచి..ఎలీజా చింతలపూడి నుంచి సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారు.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की 11वीं लिस्ट। pic.twitter.com/TpMaGKiSdD
— Congress (@INCIndia) April 2, 2024
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎక్కువ మంది కొత్త వారే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని చోట్ల ప్రముఖ నేతలు ఎవరైనా పోటీ చేయాడానికి ఆసక్తి చూపిస్తే వారికి అవకాశం కల్పించారు.
మొత్తంగా 175స్థానాలకు గాను 114 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. శక్తివంచన లేకుండా ప్రయత్నించే వారికే టిక్కెట్లు దక్కినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన తర్వాత ఆ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై పెద్దగా ఎవరు ఆసక్తి చూపించలేదు.కానీ ఈ సారి షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోవడంతో పాటు రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించడంతో.. మంచి ఓటు బ్యాంక్ సాధిస్తుందన్న నమ్మకంతో కాంగ్రెస్ శ్రేణుల యాక్టివ్ అవుతున్నాయి.
షర్మిల స్వయంగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. తొలి జాబితాలో పులివెందులకు ఎవరి పేరూ ఖరారు చేయలేదు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె లేకపోతే ఆమె తల్లి ఎన్నికల్ల పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీై ఇంత వరకు ఖరారు కాలేదు., వారు నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వైఎస్ సునీత పోటీకి అంగీకరిస్తే ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. అయితే తమ టార్గెట్ అవినాష్ రెడ్డి అని..ఆయనను ఓడించడమే లక్ష్యమని సునీతారెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో పులివెందులలో పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టతలేదు. అయితే లోక్ సభకు షర్మిల పోటీ చేస్తున్నందున.. పులివెందుల నుంచి కూడా వైఎస్ కుటుంబం నుంచే ఒకరు పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆ అభ్యర్థి ఎవరనేది.. మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. షర్మిల, అవినాష్ రెడ్డి మద్య గట్టి పోటీ జరగం ఖాయంగా కనిపిస్తోంది.