Breaking News Live: శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. వాయుగుండం నేడు అసని తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.
దక్షిణ బంగాళాఖాతంలో మార్చి 16న ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాయుగుండం అసని తుఫాన్‌గా మారింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కదిలి పోర్ట్ బ్లెయిర్‌కు 170 కి.మీ దక్షిణంగా, నికోబార్ దీవులకు 110 కి.మీ వాయువ్యంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం, అమరావతి కేంద్రం తెలిపాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ శనివారం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం తుఫాన్‌గా బలపడింది.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అసని తుఫాన్ నేపథ్యంలో మరోవైపు తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని వాతావరశాఖ హెచ్చరించింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గత రెండు వారాలుగా పెరుగుతున్న ఎండల నుంచి ఉత్తర కోస్తా, యానాం ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. గత మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. .
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
అసని తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో చలి గాలులు వేగంగా వేచనున్నాయి. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్ (Temperature in Andhra Pradesh)
తెలంగాణలో హైదరాబాద్ సహా కొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. దీంతో నగరవాసులకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 కిందకి దిగొచ్చింది. అయినా పగటి పూట వేడ అధికంగా ఉంటుంటే, సాయంత్రానికి చిరుజల్లులు పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయి. భగభగ మండే రామగుండంలో ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పడిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) స్థిరంగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,600 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.72,300 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,300 గా ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లా రాజాం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ద్విచక్ర వాహనాలు, షాపులు పలుచోట్ల ధ్వంసమయ్యాయి. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బంగాళాఖాతంలో అసమి తుపాను కారణంగా ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. కాకినాడలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
వచ్చే ఎన్నికల్లో 105 స్థానాలు గెలుస్తాం : సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. 30 నియోజకవర్గాల్లో ఒక స్థానం కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీజేపీకి మతపిచ్చి పట్టుకుందని ఆరోపించారు.





















