Jagan To Delhi : బుధవారం ఢిల్లీకి జగన్ - ప్రధానితో మీటింగ్ ! ఎజెండా ఏమిటంటే ?
బుధవారం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
Jagan To Delhi : ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ 28వ తేదీన సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ మేరకు పీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్‌ను ఖరారు చేసింది. 28వ తేదీన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమాన్ని 30వ తేదీకి వాయిదా వేసి.. డిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.
సీఎం జగన్ డిల్లీ పర్యటన పై రాజకీయ వర్గాల్లో చర్చ మెదలైంది. ఇప్పటికే జగన్ అనేక సార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలసి పలు అంశాల పై చర్చించారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న సమస్యలు. ప్రత్యేక హోదా వంటి అంశాలతో పాటు రాష్ట్ర లోటు బడ్జెట్ కు సంబంధించిన అంశాలను గురించి జగన్ అనేక సార్లు మోడీ వద్ద ప్రస్తావించారు. పలువురు కేంద్ర మంత్రులను కూడ జగన్ కలసి ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన అంశాలను గురించి ప్రస్తావించి,వాటి పై హామీలు తీసుకున్నారు. అయితే వాటి పురోగతి, రాబోయే రోజుల్లో కేంద్రం నుండి అందాల్సిన సహకారం, రాష్ట్ర వాటా నిధులు వంటి కీలక అంశాల పై జగన్ మోడీ ముందు ప్రస్తావించే వీలుటుందని అధికార వర్గాలు అంటున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్దితులు ఇప్పటి వరకు ఆశించిన మేర సంతృప్తి గా లేవు. ఆర్దికంగా రాష్ట్రం పురోగమనం సాధించాల్సిన అవసరం చాలా అత్యవసరంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు,పెన్షన్లు, సంక్షేమ పధకాల అమలు వంటి అంశాలను గురించి జగన్ ప్రదాని ముందు ప్రస్తావిస్తారని అంటున్నారు. నవంబర్ 12వ తేదీ విశాఖ కేంద్రంగా సీఎం జగన్,ప్రదాని కలసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబందించిన అంశాల పై కూడా జగన్ వివరాలు అందించారు. ఆ తరువాత ప్రధాని రియాక్షన్ ఎంటనేది స్పష్టత లేదు. రాష్ట్ర అంశాల ప్రస్తావన తో పాటుగా రాజకీయ వ్యవహరాలు కూడ ఈ ఇద్దరు నేతల మధ్య చర్యకు వచ్చే అవకాశం లేకపోలేదని పార్టి వర్గాలు భావిస్తున్నాయి.
ఎపీలో వైసీపీ, బీజేపీ నేతలు పోటా పోటీగా రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ వ్యవహరాల్లో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీలో ఎట్టి పరిస్దితుల్లో అదికారంలోకి రావాల్సిందేనని బీజేపి అగ్రనాయకత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు పొత్తుల వ్యవహరం పై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. బీజేపి, జనసేన నేతలతో పొత్తు కంటిన్యూ అవుతుంది. అయితే జనసేన కూడ టీడీపీ ని కలుపుకొని ముందుకువెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల పై ఇంకా క్లారిటి రాలేదు. దీంతో ఇరు పార్టిలు వైసీపీని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్,విశాఖ కేంద్రంగా జరిగిన కార్యక్రమంలో మోడీతో సమావేశం అయ్యారు. అయితే ఆ సమావేశానికి సంబంధించిన అంశాల పై జనసేన అధినేత పవన్ పూర్తిగా క్లారిటి ఇవ్వలేదు. ఇదే సమయంలో జనసేన లో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడ కీలక కామెంట్స్ చేశారు. మోడీ,పవన్ బేఠికి సంబందించిన అంశాలు బయట పెట్టాల్సిన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతామని మాత్రం క్లారిటి ఇచ్చారు.