By: ABP Desam | Updated at : 19 Oct 2021 09:45 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్(Source: Ysrcp Facebook)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పటమట దత్తనగర్‌లోని గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామితో సమావేశమ్యారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం జగన్ సోమవారం దత్తానగర్ లో గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.
Also Read: పైడితల్లి అమ్మవారి ఉత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్‌గజపతిరాజు
హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు
సీఎం జగన్‌తో సమావేశం అనంతరం గణపతి సచ్చిదానందస్వామి మీడియాతో మాట్లాడారు. ఏపీలో దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని సచ్చిదానందస్వామి అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అర్చకులు ఆనందంగా ఉన్నారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వంశపారంపర్య అర్చకులను కొనసాగించాలని సీఎం జగన్ ను అడిగినట్లు తెలిపారు. అందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని గణపతి సచ్చిదానందస్వామి తెలిపారు.
Also Read: విశాఖ మన్యంలో కాల్పుల కలకలం... పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి... తుపాకులకు పనిచెప్పిన నల్గొండ ఖాకీలు
35 దేశాల్లో దత్తపీఠం శాఖలు
దత్త పీఠానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 35 దేశాల్లో దత్తపీఠం శాఖల ద్వారా గణపతి సచ్చిదానంద స్వామి హిందూ ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో మరో 89 శాఖలను ఆయన ప్రారంభించారు. వీటి ద్వారా పేదలకు నిత్యం అన్నదానం, ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ ఫీలింగ్ రాగ సాగర నాద పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. మ్యూజిక్ ద్వారా చికిత్సల కోసం అనేక దేశాలలో సంగీత విభావరులు దత్తపీఠం నిర్వహిస్తుంది.
Also Read: త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. లిస్టులో ఉన్న 14 మంది వీళ్లేనా?
Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలోకి రఘురామ .. కానీ ఎన్నికలెప్పుడు ?
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Chandrababu : ఎమ్మెల్సీ అనంతబాబు పెళ్లిళ్లు, పేరంటాలకు తిరుగుతున్నా అరెస్టు చేయడంలేదు, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?