News
News
X

పైడితల్లి అమ్మవారి ఉత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్‌గజపతిరాజు

విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.  దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతి రాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

FOLLOW US: 

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి ఉత్సవాల సంబంరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలను దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతి రాజు సమర్పించారు.  కుటుంబ సభ్యులతో కలిసి  ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహ భాగ్యంగా భావిస్తున్నా అని పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. పండగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్టు అశోక్ గజపతి రాజు చెప్పారు. 

పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి చెప్పారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైడి తల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, అమ్మవారి దర్శనానికి నిన్న, ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారాన్నరు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు విధిగా మాస్క్ ధరించి పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు. అలాగే పైడి తల్లి అమ్మవారి ఆశీసులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.

పైడితల్లమ్మ ఉత్సవం సందర్భంగా సోమ, మంగళవారాల్లో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న సమీపంలోని మద్యం దుకాణాలు మూసి వేయించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌  సూర్యకుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశా రు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి, నగరానికి సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు తెరవరాదని సూచించారు. శాంతి భద్రత ల కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Also Read: Kurnool Crime: భర్త గొంతుకు టవల్ చుట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి..

Also Read: Selfie Death: సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది... దిండి జలాశయంలో పడి ఇద్దరు యువకులు మృతి... నగరిలో యువకుడు గల్లంతు

Also Read: Visakha Police Fire: విశాఖ మన్యంలో కాల్పుల కలకలం... పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి... తుపాకులకు పనిచెప్పిన నల్గొండ ఖాకీలు

Also Read: 4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద

Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Oct 2021 11:20 AM (IST) Tags: Ashok gajapati raju vizianagaram pydithalli pydithalli sirimanostavam

సంబంధిత కథనాలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Breaking News Live Telugu Updates: మూడు రాజధానులు ఓ నాటకం - వికేంద్రీకరణ బూటకం: తులసీ రెడ్డి

Breaking News Live Telugu Updates: మూడు రాజధానులు ఓ నాటకం - వికేంద్రీకరణ బూటకం: తులసీ రెడ్డి

Rayalaseema University: ముడుపులు సమర్పిస్తేనే అనుమతులు, 32 కాలేజీల పర్మిషన్ రద్దు, అంతలోనే ఊరట

Rayalaseema University: ముడుపులు సమర్పిస్తేనే అనుమతులు, 32 కాలేజీల పర్మిషన్ రద్దు, అంతలోనే ఊరట

నేను జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు, నచ్చక రాజీనామా చేస్తున్నా - వెనక్కి తగ్గను: యార్లగడ్డ

నేను జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు, నచ్చక రాజీనామా చేస్తున్నా - వెనక్కి తగ్గను: యార్లగడ్డ

AP SC Welfare: ఏపీలో ఎస్సీల సంక్షేమానికి కేంద్రం రూ.2,837 కోట్లు - శాఖల వారీగా కేటాయింపుల వివరాలు

AP SC Welfare: ఏపీలో ఎస్సీల సంక్షేమానికి కేంద్రం రూ.2,837 కోట్లు - శాఖల వారీగా కేటాయింపుల వివరాలు

టాప్ స్టోరీస్

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

Kcr Reservation Politics : రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

Kcr Reservation Politics :    రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా  జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?