YS Jagan On Power : విద్యుత్ మీటర్ల వల్ల లాభాలేమిటో రైతులకు చెప్పాలి - అధికారులకు సీఎం జగన్ ఆదేశం !
విద్యుత్ మీటర్ల వల్ల లాభాలేంటో రైతులకు చెప్పాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు లేఖలు రాయాలని సమీక్షలో సూచించారు.
YS Jagan On Power : ఏపీలో వ్యవసాయ మెటార్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలంటే చెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని’’ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ‘రైతుపై ఒక్కపైసాకూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించండి. శ్రీకాకుళంలో పైలట్‌ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయ్యిందో వివరించండి. రైతులకు జరిగిన మేలు కూడా వివరించండి. 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలన్నారు. మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవు, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుంది, నాణ్యంగా విద్యుత్ సరఫరా ఉంటుందనే విషయాన్ని వారికి వివరించాల్నారు.
వ్యవసాయ పంపు సెట్ల కోసం పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలి. ఎక్కడ ట్రాన్సాఫార్మర్ పాడైనా వెంటనే రీప్లేస్ చేయాలని సీఎం ఆదేశించారు. ధర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని, దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘‘విద్యుత్ డిమాండ్ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి.
పోలవరం విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ పనులపైనా సీఎం సమీక్షించారు. పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని కూడా 2024 ఏప్రిల్‌నాటికి పూర్తిచేసేదిశగా అడుగులు ముందుకేస్తున్నామని అధికారులు తెలిపారు. ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష చేశారు. డిసెంబరులోగా టెండర్లు ఖరారు చేయాలని సీఎం స్పష్టం చేశారు.
–దేశవ్యాప్తంగా విద్యుత్‌కొరత ఉన్న రోజుల్లో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్ కొనుగోలు చేసినట్టుగా అధికారులు సమీక్షలో సీఎంకు తెలిపారు. మార్చిలో 1268.7 మిలియన్ యూనిట్లకోసం రూ. 1123.7 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ. 1022.4 కోట్లు, మే నెలలో రూ.832.92కోట్లు , జూన్‌నెలలో 936.22 మిలియన్ యూనిట్లకోసం రూ. 745.75 కోట్లు, జులై 25 వరకూ 180.96 మిలియన్ యూనిట్ల కోసం రూ.125.95 కోట్లు ఖర్చు చేశామని అధికారులు తెలిపారు. ప్రజలకు నిరంతరం విద్యుత్ ఇవ్వడానికి ఎంతైనా ఖర్చు చేస్తామని జగన్ తెలిపారు.