CM Jagan : రెండు గంటల్లో యాభై వేల మందికి భోజనం రెడీ - అక్షయపాత్రను ప్రారంభించిన సీఎం జగన్ !
ఇస్కాన్ నిర్మించిన అక్షయపాత్ర వంట శాలను సీఎం జగన్ ప్రారంభించారు. మధ్యాహ్న భోజనం పథకానికి భోజనాలను ఇక్కడి నుంచి సరఫరా చేయనున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో ఇస్కాన్ సంస్థ ( ISKON )నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయం, ( Sri Krishna Temple ) గోశాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) భూమిపూజ చేశారు. రూ. 70 కోట్లతో ఏర్పాటు కానున్న గోకుల క్షేత్రం, ఈ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాలతో పాటు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణా కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాలను ఇస్కాన్ నిర్మాణం చేయనుంది. ఇందు కోసం ప్రభుత్వం దేవాదాయశాఖకు చెందిన భూమిని కేటాయించింది.
సీఎం జగన్ కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత డుమ్మా - తీవ్ర అసంతృప్తే కారణం ..
అంతకు ముందు ఆత్మకూరులోలో ఇస్కాన్ నిర్మించిన అక్షయపాత్ర ( Akshya patra )సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి ( Mid Day Meals ) అవసరమైన ఆహారాన్ని ఇక్కడే తయారు చేయనున్నారు. అత్యాధునికంగా నిర్మించిన వంటశాల రెండు గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్ధం చేస్తుంది. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. దీని కోసం ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ అత్యాధునిక వంటశాలను రెడీ చేసింది. అక్షయపాత్ర వంట శాల ప్రారంభం తర్వాత తర్వాత చిన్నారులతో కలిసి ముఖ్యమంత్రి ఫొటోలు దిగారు. అనంతరం వారికి స్వయంగా భోజనాలను వడ్డించారు.
త్రిసభ్య కమిటీ తొలి భేటీలో నిరాశే ! తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్క అంశంలోనూ రాని ఏకాభిప్రాయం..?
అంతకు ముందు దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ( Vellampalli Srinivas )శ్రీశైలం దేవస్ధానం ( Srisailam Temple ) కార్యనిర్వహణాధికారి లవన్న సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డిోత సమావేశం అయ్యారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ( Maha Sivaratri ) హాజరు కావాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కి వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు.
ఈ కార్యక్రమాల్లో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర గుంటూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శిలాఫలకంపై పేరు లేకపోవడంతో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాత్రం గైర్హాజర్ అయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత జగన్ తాడేపల్లిని నివాసానికి వెళ్లారు .