IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Breaking News Live: కబడ్డీ ఆడుతూ పడిపోయిన ఎస్ఐ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
కబడ్డీ ఆడుతూ పడిపోయిన ఎస్ఐ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 

తిరుపతి వెస్ట్ ఎస్ఐ సుబ్రమణ్యం ఆకస్మికంగా మృతి చెందారు. కబడ్డీ ఆడుతూ ఎస్ఐ సుబ్రమణ్యం సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే తోటి సిబ్బంది ఎస్ఐను రుయా హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఎస్ఐ సుబ్రమణ్యం మరణించారు. 

సీపీఐ నారాయణ సతీమణి కన్నుమూత 

సీపీఐ నారాయణ సతీమణి వసుమతి(65) కన్నుమూశారు. అనారోగ్యంతో తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. 

సత్తెనపల్లెలో దారుణం, అనుమానంతో యువతి గొంతు కోసిన యువకుడు 

పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో దారుణ ఘటన జరిగింది. అనుమానంతో ఓ యువకుడు యువతి గొంతు కోసాడు. యువతి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. యువతి, యువకుడు గత కొంత కాలంగా సహజీవనం చేస్తు్న్నట్లు తెలుస్తోంది.  

రేణిగుంట రైల్వే గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం

తిరుపతి రేణిగుంట సమీపంలోని రైల్వే గ్యారేజ్ రిపేర్ షాప్(CRS)లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యారేజ్ లో నిల్వ ఉంచిన వేస్టేజ్ పరికరాలు మొత్తం తగలబడ్డాయి. వేస్టేజ్ మొత్తం రబ్బర్ కావడంతో ఒక్కసారిగా మంటలు అధికంగా వ్యాపించాయి. మంటలను అదుపు చేయలేక ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు.

మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురికి స్వల్పగాయాలు 

హైదరాబాద్ మలక్ పేట్ మెయిన్ రోడ్డుపై ఆటోను తప్పించబోయి ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్ డ్రైవర్, ఇద్దరు యువతులతో సహా ఆటో డ్రైవర్ కు  స్వల్ప గాయాలయ్యాయి. దిల్ సుఖ్ నగర్ నుంచి పటన్ చెరు వెళ్లే ఆర్టీసీ బస్ మలక్ పేటలో అడ్డంగా వచ్చిన ఆటోను తప్పించపోయి మెట్రో పిల్లర్ కు ఢీకొట్టింది. దీంతో మెట్రో పిల్లర్ పాక్షికంగా ధ్వంసం అయింది.

Bhadradri Kothagudem: మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారుజామున ఆత్మహత్య పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతురాలు మహాలక్ష్మి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్ అవుతుంది. బూర్గంపాడు మండలం సారపాక లో ఈ ఘటన జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నేడు వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఈ నెల 15, 16 తేదీల్లో వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. 15వ తేదీ సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఒంటిమిట్ట వెళ్ళి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరవుతారు. పట్టువస్త్రాలను సమర్పించి కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. అనంతరం కడప చేరుకుంటారు. 16న కడప, కర్నూలు జిల్లాల్లో పలు వివాహ వేడుకల్లో వధూవరులను ఆశీర్వాదిస్తారు. 16 వ తేదీ ఉదయం రెండు వివాహ వేడుకల్లో పాల్గొని, అక్కడి నుంచి కర్నూలు చేరుకుంటారు. అక్కడ ఓ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

Background

తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఒకట్రెండు రోజలు వర్షాలు పడేఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు ప్రాంతాల్లో పడొచ్చనని అంచనా వేస్తోంది. దక్షిణ, తూర్పు తెలంగాణలో జిల్లాలోని ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది. 

తమిళనాడు నుంచి వస్తున్న తేమ గాలుల వల్ల రాయలసీమలోని పలు భాగాలు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం పరిసర ప్రాంతాలు, తిరుపతి నగరంలోని దక్షిణ భాగాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి నగరంలో వాతావరణం చల్లగా చినుకులు పడుతూ ఉండనుంది. భారీ వర్షాలు అయితే ఉండవు.

కొన్నిప్రాంతాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందని తెలుస్తోంది. సముద్రపు గాలులు పెరగడం వల్ల కోస్తా ప్రాంతాల్లో కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా దాక 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతోంది. ఒక్క పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయి. విశాఖ​, తిరుపతి, కాకినాడ​, రాజమండ్రి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ​, మచిలీపట్నం, విజయనగరంలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 మధ్యలో నమోదయ్యే ఛాన్స్ ఉంది. కడప​, అనంతపురం, కర్నూలు నగరాల్లో 41 డిగ్రీల దగ్గర్లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 

అకాల వర్షాల సీజన్ ఏప్రిల్ 17 నుంచి మొదలుకానుంది. మొదట 17 నుంచి 20 దాక అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు), విజయనగరం, పార్వతీపురం మణ్యం జిల్లాతోపాటుగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే అకాల వర్షాలుంటాయి, శ్రీ సత్యసాయి జిల్లా (పుట్టపర్తి), అనంతపురం, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా (మదనపల్లి సైడ్) కొన్ని వర్షాలుంటాయి.

ఏప్రిల్ 20 నుంచి తెలంగాణ రాష్ట్రం దక్షిణ భాగాల్లో వర్షాలు పెరుగుతాయి. అక్కడక్కడ నుంచి అకాల వర్షాల సిజన్ పుంజుకుంటుంది. విశాఖ​, కాకినాడ​, తిరుపతి, గుంటూరు, ఎన్.టీ.ఆర్ జిల్లా (విజయవాడ​), ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడ కొన్ని వర్షాలుంటాయి. అలాగే కడప​, నంధ్యాల​, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా (మచిలీపట్నం) జిల్లాల్లో కూడ కొన్ని వర్షాలుంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే బాగా పెరిగింది. గత రెండు రోజులుగా నిలకడగా ఉంటున్న ధరల్లో ఒక్కసారిగా కుదుపు చోటు చేసుకుంది. ఏకంగా 10 గ్రాముకు రూ.350 పెరిగింది. ఈ రెండ్రోజుల్లోనే ధర రూ.750 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర నేడు కిలోకు రూ.1500 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.49,350 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.53,840 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.74,200 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,350 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,840గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.74,200 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.49,350 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.53,840గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,200 గా ఉంది.

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి