Chandragiri: మా భూమిని కబ్జా చేశారు... పసిబిడ్డతో పోలీసు స్టేషన్ ముందు భార్యభర్తల నిరసన...
పసిబిడ్డతో పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఓ కుటుంబం నిరసన చేసింది. తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని, అధికారులు బాధ్యులపై చర్య తీసుకోవడంలేదని బాధితులు ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ ఎదుట పసిబిడ్డతో ఓ కుటుంబం బైఠాయించి నిరసన తెలిపారు. తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులు కాళ్లు పట్టుకుని దంపతులు వేడుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది. చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం పసిబిడ్డతో భార్యభర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. జక్కలవారిపల్లిలో తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని దంపతులు హేమాద్రి, చంద్రిక ఆవేదన చెందారు. భూఆక్రమణపై విచారణకు వచ్చిన ఎంఆర్వో సమక్షంలో తమపై దాడి చేశారని దంపతులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ఇంక చేసేదేంలేక పోలీసు స్టేషన్ ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ ఘటనపై గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేశామని బాధితులు అంటున్నారు.
Also Read: చాంతాడంత చలానా లిస్టు చూసి అవాక్కైన పోలీసులు... బైక్ పై 25 చలానాలు పెండింగ్
బాధితుల ఆవేదన
'అయ్యా...నేను పనపాకం పంచాయతీ జక్కలవారిపల్లి గ్రామంలో నివశిస్తున్న చిన్న, సన్నకారు రైతుని, సర్వే నెం.652A1 లో 92 సెంట్ల భూమిని చెంగల్ రాయలు శెట్టి, షణ్ముగం మా భూమిని కాజేయాలని అవకాశం కోసం చూసి, ఇప్పుడు మా భూమిని ఆక్రమించుకున్నారు. దీనిపై ఎమ్మార్వో విచారణ చేసేందుకు రాగా ఆయన సమక్షంలోనే మాపై దాడి చేసి ఫోన్లు లాక్కున్నారు. మా సెల్ ఫోన్లను హరిబాబు, యోగేష్ లాక్కున్నారు. వీరిపై ఇది వరకే కేసు నమోదైంది. కానీ ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా పొలం ఆక్రమించుకుని, మాపై దాడులకు పాల్పడుతున్నారు. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ' అని బాధితులు పోలీసులకు లేఖ రాశారు.
Aslo Read: కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి