Chandrababu warning: టీడీపీలో కోవర్టుల వల్లే హత్యా రాజకీయాలు - వదిలి పెట్టేది ఉండదని చంద్రబాబు హెచ్చరిక
TDP: టీడీపీలోని కోవర్టుల వల్లే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఇలాంటి పనులకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని మహానాడులో హెచ్చరించారు.

Coverts in TDP: పార్టీలో కొంతమంది ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారని చంద్రబాబు మహానాడులో సంచనల వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు తాను ఎవరినీ నమ్మడం లేదన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఎవర్నీ వదిలిపెట్టననని హెచ్చరించారు. వీరయ్య చౌదరి హత్య వెనుక ఈ కోవర్టుల పాత్ర ఉందన్నారు. ఈ హత్యలు రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నాయని, వైసీపీ నాయకత్వం ఈ హత్యలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. "నేరస్థులు ఖబడ్దార్. నా దగ్గర ఎవరి ఆటలు సాగవు" అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీలో నిజమైన కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని, కానీ "వలస పక్షులు" కోవర్టులు వచ్చి పోతారని వ్యాఖ్యానించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువగా జరిగాయని, టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రోద్భులంతోనే ఇవన్నీ జరిగాయని , అతని హయాంలో రాష్ట్రంలో అరాచకం నెలకొందని విమర్శించారు. వీరయ్య చౌదరి టీడీపీ యొక్క కీలక నాయకుడిగా ఉన్నారు. అతని హత్య రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. చంద్రబాబు ఈ హత్యను వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా చూపారు, మరియు టీడీపీలోని కొందరు కోవర్టులు ఈ హత్యకు సహకరించారని ఆరోపించారు. అలాగే మాచర్లతో ఇటీవల ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. హత్య చేసిన వారు వైసీపీ నుంచి టీడీపీలో చేరారని చెబుతున్నారు. అధికారం ఉందని పార్టీలో చేరేవారు. ఇలా హత్యకు పాల్పడుతున్నారని చంద్రబాబు భావిస్తున్నారు.
టీడీపీలో కోవర్టులున్నారు. కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు @ABPDesam #CMChandrababuNaidu #Naralokesh #TDPMahanadu2025 #Kadapa #TDP #ABPDesam pic.twitter.com/1WBUJXe4fR
— ABP Desam (@ABPDesam) May 28, 2025





















