Good News For Women: మహిళలకు గుడ్‌న్యూస్- తల్లికి వందనం నగదు జమ, ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రకటన
TDP Mahandadu 2025 | ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రకటించారు.

Talliki Vandanam Scheme | కడప: 2029 ఎన్నికల్లో 2024 కంటే ఎక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అన్నారు. ప్రతి సందర్భంలోనూ వెనుకబడిన వర్గాల వారికి మెరుగైన అవకాశాలు ఇవ్వాలి. వారి అభివృద్ధి కోసం టీడీపీ పాటుపడుతోంది. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు ప్రయోజనాలు చేకూరాలి. బడుగు, బలహీనవర్గాల వారికి అండగా నిలవాలి. వెనుకబడిన వర్గాల వారి కోసం అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించిన నేత ఎన్టీఆర్.
వెనుకబడిన వర్గాల నేతలైన జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ చేశాం. సామాజిక న్యాయం చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం. మాల, మాదిగ వర్గీకరణ కోసం చర్యలు చేపట్టిన పార్టీ మనది. సుప్రీంకోర్టుకు వెళ్లి సామాజిక న్యాయం కోసం పోరాటం చేశాం. 1996లో చేసిన వర్గీకరణను 2025లోనూ పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
తల్లికి వందనం, ఉచిత బస్సుపై గుడ్ న్యూస్
వచ్చే నెలలో తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు ఇస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తాం. ఇప్పటికే దీపం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. డ్వాక్రా సంఘాలతో మహిళా సాధికారత వస్తుంది. మహిళలు రాజకీయంగా, ఆర్థిక, సామాజికంగా మగవారితో సమానంగా ఉండాలన్నే నా సంకల్పం. పురుషులు ఈ విషయంలో సహకరించాలి. ఆడబిడ్డలు బాగుంటే అక్కడ మనకు మంచి జరుగుతుంది. 50 రూపాయలకే కరెంట్ ఇచ్చాం. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. పామాయిల్ సాగు తీసుకొచ్చాం. రాయలసీమను సస్యశ్యామలం చేసిన పార్టీ టీడీపీ. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ ప్రపంచంలోనే బ్రాండ్ గా మారుతోంది. రాయలసీమలో హార్టికల్చర్, కోస్తాంధ్రంలో వాణిజ్య పంటలకు సహకారం అందిస్తాం. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం. రైతులకు మూడు విడతల్లో వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తాం.
జనాభా ప్రమోషన్..
గతంలో జనాభా నియంత్రణకు మొగ్గుచూపాం. ఇప్పుడు జనాభా ప్రమోషన్ కోసం చర్యలు చేపట్టాం. యువత తగ్గిపోతే చాలా సమస్యలు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీ4 (ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్) విధానం పేదలకు వరం లాంటిది. పీ4తో పేదరికాన్ని నిర్మూలించే చర్యలు చేపట్టాం.
ఆస్తిలో మహిళలకు హక్కు ఇచ్చింటి ఎన్టీఆర్, ఆ తరువాత డ్వాక్రా మహిళల వ్యవస్థ తీసుకొచ్చాను. ఉద్యోగాలు, కాలేజీ సీట్లలో వారికి అవకాశాలు పెంచాం. ఆడబిడ్డలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే వారికి అదే రోజు చివరిరోజు అవుతుంది. 22 మంది మహిళలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. డ్వాక్రా సంఘాల మహిళలను లక్షాధికారులు కడపలో మాధవిరెడ్డిని అంతా తక్కువ అంచనా వేశారు. రిజల్ట్ చూస్తే ఆమె అదరగొట్టింది. మహిళా శక్తి అంటే అదే’ అన్నారు చంద్రబాబు. నన్ను అక్రమ కేసుల్లో జైల్లో పెట్టిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో 52, 53 రోజులు పోరాటం చేశారు. నా మీద వారికున్న అభిమానం అలాంటిది’ అన్నారు.






















