అన్వేషించండి

Chandrababu Delhi: సముద్రంలోకి వెళ్లే నీళ్లతోనే బనకచర్ల - 2027కే పోలవరంపూర్తి - ఢిల్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Banakacharla project: బనకచర్ల ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజరని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో పలు అంశాలపై మాట్లాడారు.

Chandrababu Naidu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ కు బనకచర్ల ప్రాజెక్ట్ గేమ్ చేంజరని..ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరికీ అభ్యంతరం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటినే తాము మళ్లిస్తామని తెలిపారు.  ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. సమావేశాల వివరాలను మీడియా సమావేశంలో ప్రకటించారు. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి రాగానే ప్రారంభిస్తామని తెలిపారు.  ఈ ప్రాజెక్టుకు 80వేల కోట్ల ఖర్చు అవుతుందని 290 టీఎంసీల నీటిని మళ్లించేందుకు అవకాశం ఉంటుందన్నారు. 

గత  ప్రభుత్వంలో ముందెన్నడూ లేని విధంగా విధ్వంసం జరిగిందని ఇప్పుడు  రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుందని తెలిపారు. ఒక్కో రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు.  గత ప్రభుత్వం లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టిపోయిందన్నారు.  గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ ఉండేలా చేయాలనుకుంటున్నానని తెలిపారు.  ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌కు రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం కేటాయింపు కోసం కేంద్ర ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషితో చర్చించానని తెలిపారు.   ప్రతి నియోజకవర్గంలో పది వేల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ పెట్టాల్సి ఉందన్నారు.   20 లక్షల ఎస్సీ/ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్‌టాప్ సోలార్, బీసీ వినియోగదారులకు సబ్సిడీ యాక్సెస్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 రూఫ్‌టాప్ యూనిట్లను సాధించడం తమ లక్ష్యంగా స్పష్టం చేశారు.

కేంద్రం మద్దతుతో, ఇంధన ఖర్చులను తగ్గిస్తామన్నారు. ప్రజలను శక్తివంతం చేస్తూ భారతదేశ క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ తో చర్చల వివరాలను ముఖఅయమంత్రి వెల్లడించారు.    ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌కు అభినందనలు తెలిపానని  జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్‌లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉంది.. జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్‌ను మిస్సెల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరామన్నారు.  - లేపాక్షి-మడకశిర క్లస్టర్‌లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్ , ఎలక్ట్రానికి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరాం - విశాఖ-అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్ ఎక్స్‌పరిమెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు.  తిరుపతి ఐఐటీలో డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పెట్టాలని కోరాం - మా ప్రతిపాదనలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారని సీఎం తెలిపారు. 

జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో పోలవరంపై చర్చించాను . పోలవరాన్ని 2027లోపు పూర్తి చేసేలా ప్రణాళిక ఉంది.  ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.  శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు.  శాంతిభద్రతల కోసం కేంద్రహోంమంత్రి కొన్ని సూచనలు ఇచ్చారు.  అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కోరాం.. సానుకూలంగా స్పందించారు.  ఆర్డీటీ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళామన్నారు.  పూర్వోదయ పథకం మరికొన్ని నిధులు ఇవ్వాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాను. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థికంగా సహకరించాలని నిర్మలా సీతారామన్‌ను కోరాం - మా ప్రతిపాదనలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.   కేంద్రమంత్రి సి.ఆర్‌. పాటిల్‌ను సీఎం చంద్రబాబు కలిసి, రాష్ట్రానికి సాయాన్ని కోరారు.  కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్రసింగ్‌ను సీఎం కలిశారు.  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.   నూతన నేర చట్టాల అమలుపై హోం మంత్రి అమిత్‌షా నిర్వహించే సమీక్షకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు.  శనివారం నీతిఆయోగ్ పాలకమండలి భేటీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశంలో పాల్గొంటారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget