Chandrababu Tour: సీమను మార్చేది నీళ్లు - తిట్లు శాపనార్థాలు ఏమీ చేయలేవు - హంద్రీనీవా ప్రారంభోత్సవంలో చంద్రబాబు
Rayalaseema: రాయలసీమను రతనాల సీమగా నీళ్లే మారుస్తాయని చంద్రబాబు అన్నారు. మాల్యాలలో హంద్రీనీవా మొదటి దశ ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు.

Chandrababu Naidu : హంద్రీ-నీవా ప్రాజెక్టును రాయలసీమకు జీవనాడి అని.. నీళ్లు ఉంటే రాయలసీమను రత్నాల సీమగా చేయవచ్చన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును ఎన్టీఆర్ చేపట్టారని.. అది ఆయన కల అన్నారు. తాను పూర్తి చేశానన్నారు. . ఈ ప్రాజెక్టు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించనుందన్నారు. రాయలసీమను కరువు నుండి విముక్తి చేసి, “రాళ్లసీమ”ను “రత్నాలసీమ”గా మారుస్తుందన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం, హంద్రీ-నీవాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద మోటార్ ఆన్ చేసి, సీమ జిల్లాలకు కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం.
— Telugu Desam Party (@JaiTDP) July 17, 2025
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఏడాదిలో ఒక ప్రాజెక్ట్ కోసం రూ.3,890 కోట్లు ఖర్చు చేసారు. వంద రోజుల్లో… pic.twitter.com/koRqNMAXMF
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 696 కోట్ల రూపాయలతో మొదటి దశ కాలువ విస్తరణ పనులను పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఈ విస్తరణతో కాలువ సామర్థ్యం 2,200 క్యూసెక్స్ నుండి 3,850 క్యూసెక్స్‌కు పెరిగిందని తెలిపారు. 2014-2019 మధ్య తమ ప్రభుత్వం రాయలసీమ కోసం రూ. 12,441 కోట్లు, హంద్రీ-నీవా కోసం రూ. 4,200 కోట్లు ఖర్చు చేసిందని, గొల్లపల్లి, చెర్లోపల్లి, మరాల, జీడిపల్లి రిజర్వాయర్లను పూర్తి చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం 512 ఏజెన్సీలు, 1,040 మెషీన్‌లతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, జూలై 31 నాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కాలువలకు నీటిని సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం లోని హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ స్టేషన్ వన్ నుంచి స్విచ్ ఆన్ చేసి హంద్రీ నీవా కాల్వకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నీటిని విడుదల చేశారు. (1/2) pic.twitter.com/zfyinh1HOY
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 17, 2025
రాయలసీమ రైతుల జీవితాలను మెరుగుపరచడం తన సిద్ధాంతమని, ఈ ప్రాజెక్టు ద్వారా కరువు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్నది తన లక్ష్యమని చెప్పారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో కరువు పూర్తిగా అంతరించిపోతుందని, ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టును మొదట 1985-86లో ఎన్టీ రామారావు రూపొందించారని, ఆయన రాయలసీమ కరువు సమస్యను గుర్తించి ఈ ప్రాజెక్టును ఒక కలగా ఊహించారని చంద్రబాబు గుర్తు చేశారు.
జగన్ లాంటి వాళ్లు శాపాలు ఇచ్చినా నాపై పని చేయన్నారు. జగన్ లాంటి వాళ్లు ఏం చేయగలరు? వారి శాపాలు నాపై పని చేయవు” అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 2019-2024 మధ్య రూ. 12 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 2,000 కోట్లు కూడా కేటాయించలేదని, హంద్రీ-నీవాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ఒక్క చాన్స్ ఇస్తే బాదుడే బాదుడు అన్నట్లుగా పాలన చేశారని మండిపడ్డారు.





















