Chandrababu: మంత్రి భార్య తీరుపై చంద్రబాబు సీరియస్, వెంటనే ఫోన్ చేసి ఆయనకు వార్నింగ్
Minister Ram Prasad Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి రాం ప్రసాద్ రెడ్డికి ఫోన్ చేశారు. వైరల్ అవుతున్న వీడియో గురించి వివరణ అడిగారు.
![Chandrababu: మంత్రి భార్య తీరుపై చంద్రబాబు సీరియస్, వెంటనే ఫోన్ చేసి ఆయనకు వార్నింగ్ Chandrababu Naidu gets serious over minister Ram prasad Reddy wife behaviour with police Chandrababu: మంత్రి భార్య తీరుపై చంద్రబాబు సీరియస్, వెంటనే ఫోన్ చేసి ఆయనకు వార్నింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/3be2a93d46ea2fff8dcb4fd3d55eab201719851675758234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Naidu News: ఏపీ రవాణా శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి పోలీసులతో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి భార్య హరితా రెడ్డి మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా మసలుకోవాలని.. ఇలాంటి వైఖరిని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
అయితే, ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రాం ప్రసాద్ రెడ్డి.. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. రాయచోటిలో పోలీసులు తనకు కూడా ఎస్కార్ట్‌గా రావాలని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి ఓ పోలీసుతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన ఆమె తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా అయింది.
మంత్రి గారి భార్యకీ రాచమర్యాదలు కావాలట!
— YSR Congress Party (@YSRCParty) July 1, 2024
రాయచోటిలో పోలీసులు తనకి ఎస్కార్ట్‌గా రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రుబాబు
పోలీసుల్ని బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రి గారి భార్య
నివ్వెరపోయిన పోలీసులు.. నిస్సహాయ స్థితిలో ఆమెకి సలాం pic.twitter.com/I8dIcSJGkz
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)