అన్వేషించండి

Kuppam: కుప్పం గడ్డపై గిన్నీస్ రికార్డ్- 5555 ఈ-సైకిళ్ల పంపిణీతో సరికొత్త చరిత్ర!

Guinness Book of Records: కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ-సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. ఈ సందర్భంగా చంద్రబాబు సైకిల్ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు.

Chandrababu Naidu e-cycle distribution program Guinness Records:  పర్యావరణ పరిరక్షణ ,  మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లను డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమం  గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. గిన్నీస్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ అందుకున్నారు.                           

ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభా స్థలి వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఆయన స్వయంగా ఈ-సైకిల్ తొక్కారు. వేలాది మంది మహిళలు తమ ఇ-సైకిళ్లతో ముఖ్యమంత్రిని అనుసరిస్తుండగా, ఆ ప్రాంతమంతా  సైకిల్  నినాదాలతో హోరెత్తింది.  ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేశారని, అందుకే అభివృద్ధి అంటే ఏంటో సైకిల్ వేగంతో చేసి చూపిస్తున్నామని చంద్రబాబు ఉత్సాహంగా వ్యాఖ్యానించారు.                           

ఈ ప్రాజెక్టులో మరో కీలకమైన అంశం  మేక్ ఇన్ కుప్పం . ప్రముఖ సంస్థ  ఇ-మోటరాడ్  (EMotorad) భాగస్వామ్యంతో కుప్పంలోని స్థానిక యూనిట్ లోనే ఈ సైకిళ్లను అసెంబ్లింగ్  చేస్తున్నారు.  దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా, సాంకేతికత గ్రామీణ స్థాయికి చేరువైంది. ఈ సైకిళ్లను ఇంటిపై ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని, ఒక్క పైసా ఖర్చు లేకుండా మహిళలు తమ పనుల కోసం వీటిని వాడుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.             

 
రూ. 24 వేల విలువైన ఈ సైకిళ్లను ప్రభుత్వం భారీ సబ్సిడీతో కేవలం రూ. 5 వేలకే లబ్ధిదారులకు అందజేస్తోంది. దీనివల్ల గ్రామీణ మహిళల రవాణా కష్టాలు తీరడమే కాకుండా, వారి ఆర్థిక పురోగతికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కుప్పం నుంచి ప్రారంభమైన ఈ  గ్రీన్ మొబిలిటీ విప్లవం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.           

 

టాప్ హెడ్ లైన్స్

Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget