Chandrababu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, సిద్ధార్థ్ లుత్రా కుమారుడి రిసెప్షన్‌కు హాజరు
Chandrababu News: హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. అదే రోజు రాత్రి జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు.

Chandrababu Delhi Tour: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రేపు (నవంబర్ 27)న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు (Chandrababu) హాజరవుతారు. చంద్రబాబు (Chandrababu) వెంట సతీమణి భువనేశ్వరి కూడా వెళ్లనున్నారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు (Chandrababu) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. అదే రోజు రాత్రి జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు. తర్వాతి రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం గత వారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై మంగళవారం (నవంబరు 28) సుప్రీంకోర్టులో చంద్రబాబు (Chandrababu) బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















