Chandrababu Bogapuram : 2026 కల్లా అందుబాటులోకి బోగాపురం ఎయిర్ పోర్టు - డెడ్ లైన్ ఫిక్స్ చేసిన చంద్రబాబు
Chandrababu : భోగాపురం ఎయిర్ పోర్టు 2026కల్లా రెడీ కావాలని నిర్మాణ సంస్థకు చంద్రబాబు డెడ్ లైన్ పెట్టారు. నిర్మాణ పనుల్ని సమీక్షించారు.
Bhogapuram Airport : 2026 కల్లా భోగాపురం విమానాశ్రయం ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎయిర్ పోర్టు పనులుపై బోగాపురంలో కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధుల డ్యూ డేట్ లోపు కడతామంటూ చెప్పబోయారు. అలా కాదని.. ఖచ్చితంగా డేట్ చెప్పాలన్నారు. ఆ మేరకు పనులు పూర్తి చేయాల్సిందేనన స్పష్టం చేశారు.
మీరు మాటలు చెప్పటం కాదు.. ఏ టైంకి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి చేస్తారో చెప్పండి. ఆ చెప్పిన టైంకి పూర్తయ్యేలా ప్రణాళికలతో పనులు పరుగెత్తించండి : భోగాపురం ఎయిర్ పోర్ట్ కాంట్రాక్టర్ తో సియం చంద్రబాబు గారు#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/Pd6Kifm1J0
— Telugu Desam Party (@JaiTDP) July 11, 2024
ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్‌గా భోగాపురం ఎయిర్ పోర్టు
భోగాపురం విమానాశ్రయం పూర్తైతే ప్రారంభంలోనే 48లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు ఉన్నారు. ఉత్తరాంధ్రకు బోగాపురం గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు. భోగాపురం విమానాశ్రయానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉండకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నారు.
ఉత్తరాంధ్ర యువత వలస పోకుండా పరిశ్రమలు తీసుకు రావాల్సి ఉందన్న చంద్రబాబు
గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఉత్తరాంధ్ర అద్భుత విజయాన్ని అందించిందని… ఇ అందువల్లే జిల్లా పర్యటనల్లో భాగంగా తొలుత ఉత్తరాంధ్రకే వచ్చానన్నారు. విశాఖపట్నం – విజయనగరం కలిసిపోతున్నాయన్నారు. భవిష్యత్తులో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని జోస్యం చెప్పారు. విశాఖపట్నానికి మెట్రో రావాల్సి ఉందని .. రాబోయే రోజుల్లో కుప్పం సహా ఐదు విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు.
నిర్మాణ పనుల్ని హెలికాఫ్టర్ ద్వారా పరిశీలించిన చంద్రబాబు
విమానాశ్రయం పూర్తైతే ఈ ప్రాంతం ఎకనమిక్ హబ్‌గా మారుతుందని ..చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందని.. పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురంకు మంచి అవకాశాలున్నాయన్నారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచుతామని ప్రకటించారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల ఎన్నో అంశాలు మళ్లీ మొదటికి వస్తున్నాయని .. వాటన్నింటినీ పరిష్కరించుకోవాల్సి ఉంన్నారు. బోగాపురం పూర్తి చేయించే బాధ్యత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకమన్నారు. అంతకు ముందు ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్ని హెలికాఫ్టర్ ద్వారా పరిశీలించారు.