By: ABP Desam | Updated at : 02 May 2022 07:12 PM (IST)
మే 4 నుంచి జిల్లాల పర్యటనలకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) మహానాడు కంటే ముందే జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ( TDP ) పెరిగిన ధరలు, పెంచిన పన్నులకు వ్యతిరేకంగా "బాదుడే బాదుడు" ( Badude Badudu ) పేరుతో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు మొదటగా జిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 4వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ( Amudala Valasa ) నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. 5 వ తేదీ భీమిలి ( Bhimili ) నియోజవర్గం తాళ్లవలస గ్రామంలో, 6వ తేదీ ముమ్మడి వరం నియోజవర్గం కోరింగ ( Koringa ) గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
కర్నూలుకు జనసేనాని - 8వ తేదీన రైతు భరోసా యాత్ర !
ప్రభుత్వ పన్ను పోటు, బాదుడు పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు ( TDP Agitations ) చేపడుతుంది. అందులో భాగంగా చంద్రబాబు కూడా పలు జిల్లాలలో స్వయం గా ఆ కార్యక్రమం లో పాల్గొననున్నారు. రాష్ట్రం లోని మూడు ప్రాంతాలలో ఈ పర్యటనలు ఉండేలా ప్రణాళిక సిద్దం చేశారు. మహానాడు వరకు పలు జిల్లాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పం లో ( Kuppam ) కూడా చంద్రబాబు పర్యటన ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైన తర్వాత మొదట్లో జిల్లాల పర్యటనకు వెళ్లాలనుకున్న ప్రభుత్వం వివిధ రూపాల్లో అడ్డుకుంది. ఓ సారి విశాఖ ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించి వెనక్కి పంపారు.
మా వైఎస్ మంచోడు - అంతా రాజారెడ్డి వల్లే ! హోంమంత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి డిఫరెంట్ కౌంటర్
ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా పర్యటనలు సాధ్యం కాలేదు. ఇప్పుడు కరోనా ఆంక్షలు ( Corona ) లేకపోడవం.. ఎన్నికల వేడి పెరగడంతో ఇక నుంచి జిల్లాల్లో నిరంతరాయంగా పర్యటించాలని నిర్ణయించారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తున్నారు. మహానాడులోపు ( Mahanadu ) మూడు ప్రాంతాల్లోనూ పర్యటిస్తారు. మరో వైపు లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయాలని ఇప్పటికే నిర్ణయంచారు.
జంగిల్ రాజ్‌లో ప్రజలకు రక్షణ కరవు - లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని డీజీపీకి చంద్రబాబు లేఖ
TDP Mahanadu Live Updates: ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి శాపంగా మారింది - చంద్రబాబు
Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక
TDP First Mahanadu : తొలి "మహానాడు" ఎవర్గ్రీన్ - ఆ విశేషాలు ఇవిగో
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Yoga Day Utsav: యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు
Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్నే బురిడీ - రూ.లక్షలు హుష్‌కాకీ!