అన్వేషించండి

Chandrababu : ఎవరి శాఖల పని వాళ్లు చేయండి - కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు చంద్రబాబు క్లాస్

Andhra Pradesh : కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకారు. వేరే మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు.

Cabinet Meeting :  మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకారు. మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారులను పంపించిన తర్వాత చంద్బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కొంత మంది మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరి శాఖలు వాళ్లు చూసుకోవాలని ఇతరుల శాఖల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు.  నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోండి. వారి సమస్యలపై వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు.  గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ప్రజలు తేడా గుర్తించాలన్నారు. 

వైసీపీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా కనిపించాలి !

కళ్లు నెత్తికెక్కితే చర్యలు తప్పవని మంత్రులతో చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్‌ పథకంపై సంబంధిత మంత్రి అధికారిక ప్రకటన చేయకుండా..  మరో మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేయడం గురించి చంద్రబాబు ప్రస్తావించారు.  రాంప్రసాద్‌ డిపార్టమెంట్ ఇష్యూపై నీవెందుకు స్పందించావంటూ క్లాస్ పీకారు.  చంద్రబాబు క్లాస్‌తో ట్వీట్ డిలీట్ చేశారు అనగాని సత్యప్రసాద్య. ఉచిత ఇసుక విషయంలో కూడా ఎవరూ కలుగచేసుకోవద్దని ఆదేశించారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. పారదర్శకంగా, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా వ్యవహరించాలని మంత్రులకు సూచించారు. 

ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన           

ఇసుక విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు !                

అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని..నదుల్లో పూడిక,బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక వస్తుందన్నారు.  కొత్త మంత్రులు త్వరితగతిన తమ శాఖలపై అవగాహనా పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 22 నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలన్నారు. ప్రతి నెలా తమ శాఖలపై రివ్యూ చేసి..వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలన్నారు.

విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం

సబ్జెక్ట్ పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి !                                     

కాకినాడలో ద్వారంపూడి కుటుంబం బియ్యం అక్రమాలను మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.  తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, కొడుకు ఎమ్మెల్యే, మరో కుమారుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్ .. ఇలా  ముగ్గురూ కలిసి బియ్యం రీసైక్లింగ్ చేసి బియ్యం స్మగ్లింగ్ చేశారని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.  ఏం చేద్దాం అనే దానిపై విధి విధానాలతో వచ్చే కేబినెట్  భేటీకి రావాలని చంద్రబాబు సూచించారు.  సీనియర్ మంత్రులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని..  కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారన్నారు. సబ్జెక్ట్ పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు.  ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు, అందుకు తగ్గట్టు మనం పనిచేయాలని సూచించారు.                        

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget