సత్తెనపల్లిలో అంబటి వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ- మరి కోడెల వర్గం సర్దుకుంటుందా?
తెలుగు దేశం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లలో కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగానే జిల్లా కేడర్‌కు పూర్తి సంకేతాలు పంపిస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్‌ల నియామకం స్టార్ట్ చేసింది.
సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు లైన్ క్లియర్ అయింది. ఆయన్ని ఇంఛార్జ్‌గా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అంబటి రాంబాబు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టు పోరు సాగనుంది.
తెలుగు దేశం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లలో కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగానే జిల్లా కేడర్‌కు పూర్తి సంకేతాలు పంపిస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్‌ల నియామకం స్టార్ట్ చేసింది. అత్యంత కీలకమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణను నియమించింది. దీంతో సత్తెనపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది.
అధికార పార్టీకి దీటుగా...
ప్రస్తుతం సత్తెపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలగా ఉన్న అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే సత్తెనపల్లి ఎప్పుడూ హాట్ సీటే. అంబటిని టార్గెట్‌గా తెలుగు దేశం రాజకీయ సాగుతుంది. ఇప్పుడు అధికార నేతను ఎదుర్కొనేందుకు అత్యంత సీనియర్ అయిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణను చంద్రబాబు ప్రయోగిస్తున్నారు. దీంతో రాజకీయం పోటాపోటీగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది..
కోడెల ఫ్యామిలి మాటేంటి...
కన్నా లక్ష్మీనారాయణను తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్‌గా నియమిస్తారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. అయితే పెదకూరపాడులో కన్నా లక్ష్మీనారాయణ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉందని అంతా భావించారు.అయితే సత్తెనపల్లిలో రాజకీయం కీలకంగా మారటంతో సామాజిక వర్గాల సమీకరణాల్లో కన్నాను ఛాన్స్ ఇచ్చారు. అయితే తెలుగు దేశం పార్టీలో సత్తెనపల్లి కేంద్రంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కేంద్రంగా చేసుకొని రాజకీయం జరిగింది. ఇప్పటికి ఆయన కుమారుడికే సత్తెనపల్లి సీటు వస్తుందని అంతా భావించారు. అయితే ఆఖరి నిమిషంలో కన్నాను తెర మీదకు తీసుకువచ్చారు.
సత్తెనపల్లిలో కోడెల బతికున్న సమయంలోనే ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిననాయకులే ఆందోళనలు చేశారు. కోడెలను వ్యతిరేకిస్తూ సమావేశాలు నిర్వహించటం సొంత పార్టిలోనే చర్చకు దారితీసింది. ఊహించని విధంగా కోడెల శివప్రసాద్ రావు మరణం తరువాత రాజకీయం మారిపోయింది. ఆయన కుమారుడు కూడా సత్తెనపల్లి సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అయినా ఆఖరి నిమిషంలో కన్నా నియామకంపై ప్రకటన వెలువడింది.
ఇప్పటికే పలు సమావేశాల్లో తనకు సీటు ఇప్పించాలంటూ అధినేతను కోడెల శివరాం బహిరంగంగానే అడిగారు. చంద్రబాబు ముందే బలప్రదర్శన కూడా చేశారు. కోడెల శివప్రసాదరావు పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన కుటుంబానికి ఇచ్చే గౌరవంలో భాగంగా సత్తెనపల్లి సీటు ఇవ్వాలంటూ పార్టీలో చర్చ కూడా జరిగింది. ఇప్పుడు కోడెల ఫ్యామిలి మాటేంటి అనే చర్చ మొదలైంది.
కోడెల వర్గం కన్నాతో సర్దుకుంటుందా
కోడెల శివప్రసాద్‌కు చెందిన అనుచరులు, అభిమానులు నియోజకవర్గంలో ఉన్నారు. పార్టీలో వారంతా అంకిత భావంతో పని చేస్తున్నారు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణను తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్‌గా ప్రకటించిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చర్చనీయాశంగా మారింది. కోడెల వర్గం, కన్నాతో కలసి నడుస్తుందా..ఇప్పటికే గ్రూపులుగా మారిన పార్టీని కన్నా ఎలా ముందుకు తీసుకువెళతారు. అధికార పార్టీకి చెందిన నేత అంబటి రాంబాబును ఎలా ఎదుర్కొంటారు అనే చర్చ మొదలైంది.