Andhra News : అక్రమ అరెస్టులపై కాదు అంగన్‌వాడిల సమస్యలపై దృష్టి పెట్టండి - సీఎం జగన్‌కు చంద్రబాబు సలహా!
Chandrababu :యశ్ అరెస్టుపై చంద్రబాబు స్పందించారు. అక్రమ అరెస్టుల కన్నా అంగన్‌వాడిల సమస్యలపై దృష్టి సారించాలని జగన్‌కు సూచించారు.
![Andhra News : అక్రమ అరెస్టులపై కాదు అంగన్‌వాడిల సమస్యలపై దృష్టి పెట్టండి - సీఎం జగన్‌కు చంద్రబాబు సలహా! Chandrababu advised Jagan to focus on the problems of Anganwadis rather than illegal arrests Andhra News : అక్రమ అరెస్టులపై కాదు అంగన్‌వాడిల సమస్యలపై దృష్టి పెట్టండి - సీఎం జగన్‌కు చంద్రబాబు సలహా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/23/6e78ea33d0f9f45e14570786d77c23571703321284923228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu advised Jagan : అక్రమ అరెస్టులపై కాదు.. అంగన్‌వాడీల సమస్యలపై దృష్టిపెట్టండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం 11 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీల నిరసనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం జగన్ ప్రభుత్వ అహంకార దోరణికి నిదర్శనమని మండిపడ్డారు. సేవకు ప్రతిరూపంగా ఉన్న అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో ప్రయత్నం చేయకపోగా న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనలను అణిచివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.2014 నాటికి రూ. 4,200 వేతనం పొందుతున్న అంగన్‌వాడీలకు తమ ప్రభుత్వ హయాంలో రూ. 6,300 పెంచి రూ.10,500 చేశామని తెలిపారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు.
కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత అంగన్వాడీల కష్టాలు మొదలయ్యాయని వారి కష్టాలను పట్టించుకోకుండా జీతం పెంచమని కోరేవారిపై దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అంటూ విమర్శించారు.పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వారి జీతాలు పెంచలేదని..ఉన్న జీతాల చెల్లింపులు కూడా చేయలేదంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అర్థం లేని ఆంక్షలు పెట్టి వారి సంక్షేమ పథకాలకు కోతలు పెడుతోందన్నారు.అంగన్వాడీలు చేపట్టిన సమ్మెను విచ్చిన్నం చేయడానికి పోలీసులు, వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానం నివ్వెరపరిచిందన్నారు.
న్యాయ బద్దమైన డిమాండ్లతో 11 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం వైసీపీ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు.సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఎన్ఆర్ఐ యువకుడిని అరెస్టు చేయడంపై పెట్టి శ్రద్ద…అంగన్ వాడీ సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోతుంది? అంటూ ఎన్నారై యశ్ అరెస్ట్ గురించి ప్రశ్నించారు.అనారోగ్యంతో ఉన్న తల్లి కోసం స్వదేశానికి వస్తున్న ఎన్ఆర్ఐ యువకుడు యశ్ బొద్దులూరి అరెస్టు కోసం పోలీసులను ప్రత్యేకంగా పక్క రాష్ట్రానికి పంపించి అరెస్టు చేశారంటూ మండిపడ్డారు.
యశ్ ను అరెస్ట్ చేయటానికి పెట్టిన శ్రద్ధ ఇంటి పక్కన నిరసనలు చేస్తున్న అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించేందుకు కనీసం సమయం పెట్టలేదని మండిపడ్డారు. ఇటువంటి చర్యలతో జగన్ ప్రభుత్వ విధానాలేంటో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరంముందన్నారు. ప్రభుత్వం అక్రమ కేసులు, నోటీసులు, వేధింపుల కోసం వెచ్చిస్తున్న సమయాన్ని అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై పెట్టాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
అమెరికాలో ఉండే ఎన్నారై యశ్ బొద్దులూరి తల్లికి అనారోగ్యంగా ఉండటంతో చూసుకునేందుకు అమెరికా నుంచి రాత్రి ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆయన సొంత ఊరు తెనాలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వ్యాన్‌లో ఏపీసీఐడీ ఆఫీసుకు తీసుకు వచ్చి 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. 41ఏ నోటీసులు ఇవ్వడానికి అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమిటని టీడీపీ నేతలు మండిపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)