Blue Button: విశాఖ సాగర తీరంలో విచిత్ర జీవులు - వీటి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Andhrapradesh News: విశాఖ ఆర్కే బీచ్ లో ఇటీవల బ్లూ బటన్స్ జీవులు సందడి చేశాయి. ఇవి అరుదైన, అద్భుత జీవులని.. అరుదైన సముద్ర జాతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు అన్నారు.
Blue Button Creatures in Visakha Beach: బ్లూ బటన్స్ (Blue Buttons) అనే పేరు ఎప్పుడైనా విన్నారా.?. అవి బీచ్ ల్లో కనిపించే అందమైన జీవులు. ఇవి చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంతే ఆకర్షణగానూ నిలుస్తాయి. ఇప్పుడు ఇలాంటి జీవులు విశాఖ (Visakha) సాగర తీరంలోనూ ఇటీవల కనిపించాయి. ఆర్కే బీచ్ (Rk Beach)లోని వైఎంసీఏకు ఎదురు తీరంలో ఇటీవల ఇసుక మీద మెరుస్తూ ఓ ప్రత్యేక జీవి కనిపించింది. ఈస్ట్ కోస్ట్ కన్జర్వేటివ్ టీమ్ (ECCT) నుంచి శ్రీ చక్ర ప్రణవ్, వైల్డెడ్ ఎన్విరాన్ మెంటల్ అవేర్ నెస్ గ్రూప్ నకు చెందిన విమల్ రాజ్ లు ఇటీవల ఓ సూర్యోదయాన సాగర తీరంలో వందలాది సముద్రపు డ్రాగన్స్, సముద్రపు బల్లులు కనుగొన్నారు. వీటి సాంకేతిక నామం 'గ్లౌసిల్లా మార్జినాటా'గా చెప్పారు. వీటితో పాటు బ్లూ బటన్ - పోర్పిటా పోర్పిటా, బైది విండ్ సెల్లర్, వెలెల్లా వెలెల్లా తక్కువ ఆటుపోట్ల సమయంలో ఒడ్డుకు వచ్చినట్లు తెలిపారు. తక్కువ ఆటు పోట్లు ఉన్న సమయంలో ఈ జీవులు అప్పుడప్పుడు తూర్పు తీరం వెంబడి ఈ సముద్రపు డ్రాగన్స్ కనిపిస్తాయని ప్రణవ్, విమల్ రాజ్ చెప్పారు. అయితే, ఈసారి కనిపించిన ప్లాంక్టోనిన్ జాతుల పరిమాణం చాలా చిన్నదని వివరించారు.
'అవి కుట్టినట్లే తెలియదు'
ప్లాంక్టోనిన్ జాతులకు ఈత కొట్టేందుకు అవసరమయ్యే అవయవాలు లేనప్పటికీ, అవి గాలుల ద్వారా కదులుతూ మనుగడ సాగిస్తాయని ప్రణవ్, విమల్ తెలిపారు. 'నీలిరంగు బ్లూ బటన్లు కుట్టడం మానవులకు ప్రమాదకరం కానప్పటికీ.. అవి కుట్టినట్లు కూడా మనకు తెలియదు. అదే పోర్చుగీస్ మ్యాన్ వార్ అనే జాతి జీవులు కుడితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇవి చర్మంపై కుడితే చాలా బాధ కలుగుతుంది. సముద్రపు బల్లులు (గ్లౌసిల్లా మార్జినాటా) వాటితో పాటుగా కనిపించే నీలిరంగు బటన్, బై ది విండ్ సైలర్ పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్ పై వేటాడతాయి. ఈ అద్భుతమైన నీలి రంగు షేడెడ్ జీవులు గాలిలో తేలియాడుతూ కదులుతాయి.' అని పేర్కొన్నారు. విశాఖ తీరంలో సముద్ర జాతుల గురించి సందర్శకులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి అరుదైన, అద్భుత జాతులను కాపాడుకోవాల్సి ఉందని ప్రణవ్, విమల్ అన్నారు. ఈ జాతుల ఉనికిని కాపాడి ప్రజలకు చూపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
Also Read: Jagan : ఇంటి స్థలాలివ్వకుండా అడ్డుకుంది చంద్రబాబే - మంగళగిరి చేనేతల సమావేశంలో జగన్ విమర్శలు