News
News
X

BJP On Jagan : దివాలా తీసిన కంపెనీ ఉద్యోగుల్లా ఏపీ ఉద్యోగుల పరిస్థితి - ప్రభుత్వ తీరుపై బీజేపీ విమర్శలు

దివాలా తీసిన ప్రైవేటు కంపెనీ లా ప్రభుత్వ ఉద్యోగుల దుస్దితి ఉందని బీజేపీ విమర్శించారు. నెలలో జీతం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.

FOLLOW US: 
Share:

BJP On Jagan : దివాలా తీసిన ప్రైవేట్ సంస్ద ఉద్యోగుల్లా  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల దుస్దితి ఉందని బీజేపి నేతలు మండిపడ్డారు.ఎప్పుడు జీతం వస్తుందో తెలియని దారుణమయిన పరిస్దితులను ఉద్యోగులు ఎదుర్కొంటున్నారని,ఇది చాలా దారుణమన్నారు. ఉద్యోగులు గడ్డు పరిస్థితి ని ఎదుర్కొంటున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు అన్నారు.ఉద్యోగులు తమ సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు.నెలంతా జీతం వేస్తున్నారని, ఉద్యోగులు జీతం ఎప్పుడు వస్తుందో లాటరీ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితి దివాలా తీసిన ప్రైవేటు కంపెనీ ఉద్యోగుల తరహాలో ఉందన్నారు. విద్యాసంవత్సరం చివరి పరీక్షల సమయం లో ఉపాధ్యాయులను బదిలీలు చేయటం ఎంటని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు పదోన్నతి స్కేల్ ప్రకారం కాకుండా 2,500 గౌరవ వేతనం తో పదోన్నతి కల్పిస్తోందని, ఇదేనా ప్రభుత్వ విద్యా విధానమని నిలదీశారు.
 
రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ ల్లో బంధుప్రీతి నడుస్తోందని,ఆరోపించారు. అలాంటి వాటికి  బిజెపి దూరంగా ఉంటుందని తెలిపారు. కొంత మంది రాజకీయ నేతలు అధికారం లోకి వేస్తే హోం మంత్రి కావాలంటున్నారని, వారికి ఎవరికీ అభివృద్ధి అవసరం లేదు కేవలం.. కక్షలు కోసమే ప్లాన్ చేసుకుంటున్నారని తెలిపారు. ఇసుక మాఫియా, రైస్ మాఫియా, సిలికాన్ శాండ్ మాఫియా పై గళం ఎత్తి న ఏకైక పార్టీ బిజెపి మాత్రమేని చెప్పారు. వైసీపీ మత రాజకీయాలు కు పాల్పడుతోందని, దేవాలయాలు పై దాడులు జరిగిన సంఘటన లో దోషులను ఎందుకు అరెస్టు చేయలేదని సూర్యనారాయణ ప్రశ్నించారు. 

కుటుంబ పార్టీలు వల్ల రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయని సూర్య నారాయణ రాజు ఫైర్ అయ్యారు.రాష్ట్రం లో అభివృద్ధి ఆధారంగా పనిచేస్తున్నది బిజెపి మాత్రమేని,కొల్లేరు సరస్సు ఆక్రమణ దారులు ఎంతమంది ఉన్నారో ,వారంతా ఏఏపార్టీలకు చెందిన వారో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు.కొల్లేరు సరస్సు ను అధికార పార్టీ రాజకీయాంశంగా మారుస్తోందని,కొల్లేరు సరస్సు అంతర్భాగంగా ఉన్న గ్రామాల్లో బలహీనులు పై బలవంతులు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు.ఈ కారణంగా కొల్లేరు ప్రాంతంలో శాంతి భద్రతలు సమస్యలు ఎదురవుతున్నాయని,కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.కొల్లేరు ప్రాంతంలో గ్రామకంఠం చెరువులు సంబంధించిన సంపదను గ్రామస్తులు కు కాకుండా అక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ల అనుచరులే స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు.
  
మంత్రి అమర్ నాథ్ ఎన్ని పరిశ్రమలు తెచ్చారో వెల్లడించాలని,సూర్యనారాయణ రాజు ప్రశ్నించారు.పరిశ్రమల్లో తరుచుగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సమయం లో పరిశ్రమల మంత్రి అడ్రస్ లేకుండా పోతున్నారని విమర్శించారు.అయితే స్టీల్ ప్లాంట్ గురించి పెద్ద మాటలు మాట్లాడతారని,గతంలో చంద్రబాబు అధికారంలో ఉండి పోరాటం చేస్తే ప్రజలు దూరం పెట్టారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పుడు మంత్రి అమర్ నాథ్ ఉద్యమం చేస్తే ప్రజలు వైసీపీ ని దించేయడం ఖాయమని హెచ్చరించారు.రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాల పై ఆందోళన చేపట్టనున్నామని అన్నారు.         

Published at : 31 Jan 2023 04:42 PM (IST) Tags: BJP YSRCP AP Politics AP UP DATES

సంబంధిత కథనాలు

Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!

Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!

Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు

Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!