News
News
X

AP BJP : తప్పులను ఎత్తి చూపితే కొట్టమని సీఎం అంటున్నారు - జగన్‌పై ఏపీ బీజేపీ నేతల ఫైర్ !

సీఎం జగన్ తీరుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు.

FOLLOW US: 
Share:

AP BJP :   ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే తట్టి, కొట్ట మని అధికారులకు సీఎం చెపుతున్నారని  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సీఎం జగన్ పై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వం పోలవరం డిపిఆర్ పైన అనేక ఆరోపణలు చేసిన వైసీపీ మళ్ళీ అదే డిపిఆర్ ని కేంద్రానికి సబ్మిట్ చేస్తోందన్నారు. 45.72 అడుగులు పోలవరం కట్టాలి అనుకుంటున్నారో ..  41.15 అడుగులు  కట్టాలి అనుకుంటున్నారో సీఎం సమాధానం చెప్పాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. 85 టీఎంసీల నీరు ఇస్తా అని ఇవ్వకుండా సీఎం విశాఖ వాసులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2015లో కేంద్రానికి మెట్రో డిపిఆర్  అప్పటి ప్రభుత్వం పంపిందని..  2017 లో రివైజ్డ్ డీపీఆర్ పంపాలి అని కేంద్రం చెపితే, ఇప్పటి వరకూ పంపలేదన్నారు. కానీ ప్రధానికి మాత్రం అబద్దం చెబుతున్నారని మండిపడ్డారు.  

2019 డిసెంబర్ 19 న ఎన్‌ఎండీసీతో  అవగాహవ చేసుకుని, 23 డిసెంబర్ లో కడప స్టీల్ ప్లంట్ కి భూమి పూజ చేశారని గుర్తు చేశారు.  3 సంవత్సరాల తరవతా మళ్ళీ డిసెంబర్ 23 కడప వెళ్లి స్టీల్ ప్లాంట్ నేనే కడతా అంటున్నారని విమర్శించారు.  ఒక్కో మెడికల్ కాలేజ్ కి కేంద్రం 195 కోట్లు ఇస్తే ఒక్క చిన్న పని చేయకుండా మళ్ళీ కేంద్రాన్ని మరిన్ని కాలేజ్ లు కావాలి అని అడుగుతున్నారని విమర్శఇంచారు. గత 2 సంవత్సరాల్లో 2 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇస్తే ప్రజలకు చేరింది కేవలం 20% మాత్రమేనని.. మిగతా అంతా దోచేశారని ఆరోపించారు. 1.75 లక్షల కుటుంబాలు పేదరికం లో ఉన్నాయి అని సీఎం జగన్ చెపుతున్నారని..  బియ్యం ఎందుకు పంపిణీ చేయరని ప్రశ్నించారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు రేషన్ బియ్యాన్ని అందించడాన్ని ఇంకో సంవత్సరం పొడిగించారని సత్యకుమార్ గుర్తు చేశారు. 

రాష్ట్రంలో 7 రైల్వే ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంటే సీఎం దాని పైన మాట్లాడరని.. ఏపీ ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు కేటాయించరన్నారు. విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్ చేయడం సంతోషం, కానీ ప్రభుత్వ చిత్తశుద్ధి పై మాకు అనుమానం ఉందన్నారు.   మంత్రి అమర్ తన శాఖల మీద మాట్లాడటం కన్నా, రాజకీయ పై మాట్లాడతానికే ఎక్కువ సమయం కేటాయిస్తారని మండిపడ్డారు.  ఇన్ఫోసిస్ వస్తుంది అన్నారు 4 నెలలు గడిచింది ఇంకా ఇన్ఫోసిస్ రాలేదన్నారు. సీఎం, ఐటీ మంత్రి యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి అమర్ కి సందులు గొందులు మీద ఉన్న అవగాహనా తన శాఖల పైన లేదన్నారు. స్మార్ట్ మీటర్ల విషయంలో ఏపీలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందన్నారు. స్మార్ట్ మీటర్లకు బిగించుకోవాలి అంటే 1350 రూపాయలు కేంద్ర ఇస్తుందని.. అంతకు మించి దోపిడీ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. 

దావోస్ కి బ్యాండ్ మేళం లాగా అంత మంది వెళ్లి ఎంత పెట్టుబడి తెచ్చారో చెప్పాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు.  నరేంద్ర మోదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు పెడుతుంటే, సీఎం జగన్ మాత్రం తిట్లకు సెంటర్లు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ వెళ్తుందని ప్రచారం జరుగుతున్న విషయంపై సత్యకుమార్ స్పందించారు. దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీ లో వైసీపీ లో కలిసి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 

Published at : 29 Dec 2022 03:58 PM (IST) Tags: AP BJP Satyakumar criticizes Jagan BJP criticizes YSRC

సంబంధిత కథనాలు

Nellore News : ఇద్దరు రెడ్లు పోతే మరో 10 మంది వస్తారు- ఆనం, కోటంరెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి ఫైర్

Nellore News : ఇద్దరు రెడ్లు పోతే మరో 10 మంది వస్తారు- ఆనం, కోటంరెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి ఫైర్

Gudivada Amarnath : ఏపీ భవిష్యత్తును విశాఖ మార్చబోతోంది- మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath : ఏపీ భవిష్యత్తును విశాఖ  మార్చబోతోంది-  మంత్రి గుడివాడ అమర్నాథ్

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం

AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం