BJP Vishnu : ఇళ్ల నిధుల దారి మళ్లింపు - బీజేపీ ఆందోళన ఉద్రిక్తం - ప్రభుత్వాన్ని పేదలు మార్చేస్తారన్న విష్ణు
BJP leader Vishnu : పేదల ఇళ్లకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించడంపై బీజేపీ నేత విష్ణు మండిపడ్డారు. పెనుకొండ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.
BJP Vishnu : కేంద్రం ఏపీకి కేటాయించిన 25 లక్షలు ఇల్లు కట్టలేని అసమర్ధ ప్రభుత్వం నేడు రాష్టంలో పాలన చేస్తోందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. వైసిపి ముఖ్యమంత్రి పేరున ఉన్న జగనన్న కాలనీలో ఎందుకు ఇళ్లు కట్టలేకపోయారుని ఆయన ప్రశ్నించారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో ఆర్డీవో కార్యాలయం ముందు పేదల ఇళ్లకు పెండిగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని జగనన్న కాలనీలు ఇల్లునిర్మాణం పూర్తి చేయాలని, విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలని ప్రధాన డిమాండ్లతో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్డీవో కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆర్డీవో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి.. ప్రభు్తవం తీరుపై మండిపడ్డారు. గృహాల నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధుల్లో అధిక భాగం కేంద్రం ఎప్పుడో రాష్ట్రానికి ఇచ్చేసింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏ జగనన్న కాలనీకి వెళ్లినా, పునాదులు, మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు కట్టించేది కేంద్రమైతే, 22 లక్షల గృహాలు ఏపీ ప్రభుత్వమే కడుతుందని ప్రచారం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ పూర్తి చేసింది 6 లక్షల 15 వేల ఇళ్లేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంటికి స్లాబ్ వేసినవాటినీ పూర్తయిన ఇళ్ల జాబితాలో కలిపేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై ఏపీ బీజేపీ పోరుబాట పట్టింది.
నేడు రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయిని విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు 5 సార్లు ఎందుకు పేదలపై భారం మోపారో చెప్పాలన్నారు. కేంద్ర ఇచ్చే సహకారాన్ని సైతం వినియోగించుకోలేని అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు. 2024లో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలను మీ మంత్రులకు టికెట్లు ఇవ్వడం లేదంటే పరోక్షంగా మీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఒప్పుకున్నట్టే కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల విషయంలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు మార్చడం కాదు ఈ రాష్ట్రంలో ప్రజలు వైసిపి ప్రభుత్వాన్ని మార్చేస్తారన్నారు.
విద్యుత్ చార్జీల పెంపుపై వారం రోజుల పాటు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉద్యమం నడిపిన విష్ణువర్దన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టారు. సెంట్ స్థలాల పేరుతో పేదలకును మోసం చేశారని.. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించారని తెలియడంతో ఉద్యమం ప్రారంభించారు.