By: ABP Desam | Updated at : 28 Jan 2023 09:26 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తారకరత్న కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
Tarak Ratna Health Update : హీరో నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య బృందంతో మాట్లాడిన చంద్రబాబు... తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. తారకరత్నకు పాదయాత్ర సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చిందన్నారు. కుప్పంలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం బెంగళూరు తరలించామన్నారు. తారకరత్న ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. తారకరత్న వైద్యుల పర్యవేక్షణలోఉన్నారన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, తారకరత్న కోలుకోడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు. వైద్యులు అన్నిరకాల మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.
రేపు ఆసుపత్రికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
తారకరత్న తండ్రి మోహన కృష్ణ, పురంధేశ్వరి, నందమూరి సుహాసిని, పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, చిన రాజప్ప, బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి అభిమానులు భారీగా తరలిరావడంతో నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటుచేశారు. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రేపు బెంగళూరు రానున్నట్లు తెలుస్తోంది.
హెల్త్ బులెటిన్
హీరో నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందంతో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు వచ్చింది. బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్న హెల్త్ కండిషన్ పై మెడికల్ రిపోర్టు విడుదల చేశారు. ఇందులో అత్యంత విషమ పరిస్థితుల్లో తారకరత్న ఆరోగ్యం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్ మీద బెలూన్ యాంజియో ప్లాస్టిక్ విధానంలో రక్త ప్రసరణ మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. బాలకృష్ణ ఆసుపత్రిలో ఉంటూ వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో హీరో నందమూరి తారకరత్న చికిత్స పొందుతున్నారు. అత్యవసరం చికిత్సలో భాగంగా సీఐసీయూలో ఎక్మోపై ఉంచిన వైద్య సేవలు అందిస్తున్నారు. మరో 48 గంటలపై ఎక్మో చికిత్స అందించడంతోపాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. తారకరత్నకు డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పాదయాత్రలో గుండెపోటు
నందమూరి తారకరత్నకు జనవరి 27న కుప్పంలో గుండెపోటుకు గురై స్థానిక ఆసుపత్రిలో చేరారు. కుప్పం ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు వైద్యులు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తారకరత్నను పర్యవేక్షించేందుకు బెంగళూరు నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) ఒక బృందం కుప్పం వచ్చింది. అతని పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు కుప్పం వచ్చారు. బెలూన్ యాంజియోప్లాస్టీతో వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్ (IABP) వాసోయాక్టివ్ మద్దతుతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 1 గంటలకు రోడ్డు మార్గంలో తారకరత్నను నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే సమయానికే అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ-డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.
Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !
Breaking News Live Telugu Updates: కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం
Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ
APBJP : ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీబీజేపీ - నియోజకవర్గాల కన్వీనర్ల ప్రకటన ! వారే అభ్యర్థులా ?
AP CM Delhi Visit: రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ - మరోసారి ప్రధానితో భేటీ?
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!