అన్వేషించండి

YS Sharmila: హంతకులు చట్టసభలకు వెళ్లొద్దు, హత్యా రాజకీయాలకు చెక్ పెడదామని షర్మిల పిలుపు

Andhra Pradesh News: చిన్నాన్న వివేకా చివరి కోరిక తాను కడప ఎంపీగా పోటీ చేయడం, హంతకులు చట్ట సభలకు వెళ్లవద్దు అని వైఎస్ షర్మిల అన్నారు.

APPCC Chief YS Sharmila: కడప: కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నానని, ఈ నిర్ణయం అంత సులువైంది కాదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తాను ఈ పోటీలో ఉంటే మా కుటుంబం నిట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్సార్ (YSR) అభిమానులకు ఇది చాలా క్లిష్ట పరిస్థితి. తన నిర్ణయంతో ఎటు వెళ్లాలి అనేది వైఎస్సార్ అభిమానులు నిర్ణయించుకోవాలన్నారు. గత ఎన్నికల ముందు, ఏపీ ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్ (YS Jagan).. నాకు నువ్వు చెల్లి కాదు బిడ్డ అని అన్నారని షర్మిల గుర్తుచేసుకున్నారు. సీఎం అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారు, నా అనుకున్న వారిని నాశనం చేశారని సోదరుడు జగన్ పై కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్, వైసీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు.

జగన్ నిర్ణయాన్ని తట్టుకోలేకపోతున్న షర్మిల 
తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని హత్య వెనకున్న వారికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ వైసీపీ టికెట్‌ ఇవ్వడం తట్టుకోలేక పోతున్నానన్నారు. హత్య చేయించిన వారికి టికెట్‌ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసినా వైఎస్ అవినాష్ రెడ్డికే టికెట్‌ ఇచ్చారు. చిన్నాన్న వివేకా చివరి కోరిక నేను కడప ఎంపీగా పోటీ చేయాలన్నారు. బాబాయ్ కోరిక నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నా. తనను ఆశీర్వదించాలని కడప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య జరిగితే గుండెపోటు అని జగన్ సొంత మీడియాలో దుష్ప్రచారం చేశారని, గత ఐదేళ్లు అవినాష్ రెడ్డిని ఎందుకు వెనకేసుకొచ్చారని ఈ సందర్భంగా షర్మిల ప్రశ్నించారు. 

‘కడప ఎంపీగా నువ్వు నిలబడాలమ్మా అని బాబాయ్ వివేకా రెండు గంటలపాటు అడిగారు. అప్పుడు ఆయన ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. రామలక్ష్మణుల్లా వైఎస్సార్, వివేకా ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం వివేకా ఆయన బాటలోనే నడిచారు. కానీ బాబాయ్ హత్యకు గురయ్యారు. కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డికి జగనన్న మద్దతిస్తూనే వచ్చారు. పైగా, చిన్నాన్న బిడ్డ సునీతకు అండగా నిలవాల్సింది పోయి, ఆమెను దోషి అని ప్రచారం చేయడం సిగ్గుచేటు. వివేకాను చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కు జగనన్న కడప ఎంపీగా టికెట్ ఇచ్చారు. అన్యాయం, దుర్మార్గాలకు వైసీపీ అండగా నిలవడంతో.. కడప ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. హత్యా రాజకీయాలకు నేను విరుద్ధం కనుక హంతకులు చట్టసభల్లోకి వెళ్లకూడదని వైఎస్సార్ బిడ్డగా కడప ఎంపీగా పోటీ చేస్తున్న. కానీ వైఎస్సార్ బిడ్డ అయి ఉండి జగనన్న నాన్నగారి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు అకాశం ఇచ్చారు. ప్రత్యేక హోదా రాలేదు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కనుక ప్రజలు జగనన్నకు మరో అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి’ - వైఎస్ షర్మిల

ఏఐసీసీ ఏపీ కాంగ్రెస్ నుంచి 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 5 లోక్ సభ స్థానాలకు మంగళవారం నాడు అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్ కు నందికొట్కూరు, ఎలీజాకు చింతలపూడి నుంచి సీటు కేటాయించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget