అన్వేషించండి

Breaking News Live Telugu Updates: సిద్దిపేటలో లారీ ఢీకొనడంతో సీనియర్ అడ్వకేట్ మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
AP Telangana Breaking News Telugu Live Updates 25 December CM KCR CM Jagan News Coronavirus Breaking News Live Telugu Updates: సిద్దిపేటలో లారీ ఢీకొనడంతో సీనియర్ అడ్వకేట్ మృతి
ప్రతీకాత్మక చిత్రం

Background

ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్‌ స్థాయుల్లో తూర్పు, ఈశాన్య దిశలో గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. దీనివల్ల నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ నైరుతి దిశగా గంటకు 13 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ట్రింకోమలీ (శ్రీలంక) కి తూర్పు ఈశాన్యంగా 400 కిలో మీటర్ల దూరంలో, నాగపట్టినంకు తూర్పుగా 470 కిలో మీటర్లు (తమిళనాడు), చెన్నై (తమిళనాడు)కి తూర్పు ఆగేయంగా 500 కిలో మీటర్లకు సమీపంలో కేంద్రీకృతం అవుతోంది. 

ఆ తర్వాత పశ్చిమ నైరుతి దిశగా కదిలి 25న ఉదయం శ్రీలంక తీరానికి చేరుకుంటుంది. తర్వాత శ్రీలంక మీదుగా పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ ఆదివారం (డిసెంబర్‌26) ఉదయం నాటికి కొమోరిన్‌ ప్రాంత పరిసర ప్రాంతాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలతోపాటు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఆదివారం, సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ ప్రాంతంలో ఆదివారం, సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

‘‘మొత్తానికి వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ప్రారంభం అవ్వనున్నాయి. నిన్న చెన్నైలో కురిసిన వర్షాలు ఇప్పుడు నేరుగా మన ఆంధ్రా వైపుగా వస్తున్నాయి. దీని వలన మరో మూడు గంటల వరకు దక్షిణ జిల్లాలలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ పడనుంది, అలాగే ఒకటి లేదా రెండు చోట్లల్లో మోస్తరు వర్షాలుంటాయి. ఇంక తెల్లవారి అయ్యేసరికి కొంచెం విస్తారంగా పడతాయి. దీని నుంచి భారీ వర్షాలుంటాయి అని అనుకోకండి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,850 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 54,380 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,000 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,850 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 54,380 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

17:57 PM (IST)  •  25 Dec 2022

Siddipet Road Accident: లారీ డ్రైవర్ వేగానికి ప్రాణాలు కోల్పోయిన సీనియర్ అడ్వకేట్

లారీ డ్రైవర్ వేగానికి ప్రాణాలు కోల్పోయిన సీనియర్ అడ్వకేట్..

ఈరోజు సాయంత్రం సమయంలో సిద్ధిపేట లోని ముంద్రాయి కి చెందిన సీనియర్ అడ్వకేట్ దశమంతరెడ్డి తన బైక్ పై వెళుతుండగా రంగధాంపల్లి అమరవీర స్తూపం వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ బైక్ని  ఢీ కొట్టింది.. తీవ్ర గాయాల పాలైన దశమంతరెడ్డి సంఘటన స్థలంలోని ప్రాణాలు వదిలారని స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకు తరలించారు విషయం తెలిసిన న్యాయవాదులు సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు

13:04 PM (IST)  •  25 Dec 2022

Anantapur Food Poison: అనంతపురం జిల్లాలో ఫుడ్ పాయిజన్

అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల వసతి గృహంలో పది మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పది రోజుల క్రితమే 20 మంది విద్యార్థినులు హాస్టల్లో.. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విషయం మరవక ముందే.. కలుషిత ఆహారం తిని మళ్లీ కడుపునొప్పితో విద్యార్థినులు శింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.వసతి గృహంలో సిబ్బంది మధ్య గొడవలు కారణంగానే.. ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోని విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరో పక్క రెండు వర్గాల సిబ్బంది గొడవల కారణంగా విద్యార్థినులపై ప్రతాపం చూపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget