Breaking News Live Telugu Updates: ఆస్తి కోసం సొంత అక్కనే హత్య చేసిన సోదరులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీ, తెలంగాణలో తగ్గిపోయింది. మంగళవారం కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుంచడగా, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన ఉంది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, కోట, గుణ, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం రాయ్‌పూర్, పరదీప్ గుండా ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల పై వరకు విస్తరించి ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, యానాంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో నేడు సైతం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతుండగా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తగ్గింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అర్ధరాత్రి సమయంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఈ నెల చివర్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. జూలై 23 నుంచి రాష్ట్రానికి మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు.
ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకజుకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు -2022'
నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించిన నాటి తరం తెలంగాణ కవి, దాశరథి కృష్ణమాచార్య జన్మదినం సందర్భంగా ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక సాహితీ అవార్డు... దాశరథి కృష్ణమాచార్య అవార్డు'ను 2022 సంవత్సరానికి ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవార్డు కింద 1,01,116 (ఒక లక్ష వెయ్యి నూటా పదహార్లు ) నగదు పారితోషకం తో పాటు జ్ఞాపికను అందజేస్తారు. అవార్డు ప్రదాన కార్యకస్రమాన్ని ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తారు.
Hyderabad Woman Suicide: ట్యాంక్ బండ్‌పై నుంచి హుస్సేన్ సాగర్‌లో దూకిన మహిళ
హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌లో దూకి శైలజ అనే 38 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. దూకేముందు ఆమె తన చున్నీని మెడకు బిగించుకుని తర్వాత దూకేసింది. శైలజ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నేటి ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళి పోయిన శైలజ, ట్యాంక్ బండ్‌లో శవం అయి కనిపించింది. ఆమె భర్త చనిపోవడం, వివిధ సమస్యలతో డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
TRS Protest: పార్లమెంట్ గాంధీ విగ్రహం ముందు టీఆర్‌ఎస్ ఎంపీల ధర్నా
కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేశారు. పాలు, పాల ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ న్నుపోటుకు వ్యతిరేకంగా, నిరసన తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయుడు కేకే ఆధ్వర్యంలో అ కార్యక్రమం జరిగింది. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఉభయసభలు వాయిదా
పార్లమెంటు ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. అగ్నిపథ్ సహా పలు అంశాలపై విపక్ష నేతలు పార్లమెంటులో ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
Lok Sabha adjourned till 2pm amid sloganeering by the Opposition MPs
— ANI (@ANI) July 20, 2022
I want to tell those members who are indulging in sloganeering that they should take part in discussions. The public wants the Parliament to work: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/ADLlZ4HepK
Tirumala Updates: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో వైసీపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..